పీరియడ్స్ నొప్పి బాధిస్తుందా? తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి
పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు, మహిళలు చాలామంది విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. సాధారణంగా గర్భాశయంలో సంకోచాల కారణంగా పీరియడ్స్ నొప్పి వస్తుంది. ఈ సంకోచాలు గర్భాశయం లోపలి పొర అయిన ఎండోమెట్రియం కదలికల వల్ల జరుగుతుంది. రుతుస్రావం సమయంలో రక్తం బయటకు రావడానికి ఈ కదలికలు ఉపయోగపడతాయి.
పీరియడ్స్ నొప్పి.. కారణాలివే
ఈ సంకోచాలు నొప్పిని, వాపును కలిగిస్తాయి. ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాల కారణంగా ఈ సంకోచాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ స్థాయిలలో మార్పుల వల్ల, హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా పీరియడ్స్ నొప్పి వస్తుంది. నిద్రలేమి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా జీవనశైలితో పీరియడ్స్ నొప్పి వస్తుంది. గర్భాశయ సమస్యలు ఉన్నవారికి కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి వస్తుంది.

పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే ఇలా చెయ్యండి
ఇక పీరియడ్స్ నొప్పిని సహజంగా తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలతో ఎటువంటి మందుల అవసరం లేకుండా పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవచ్చు. కడుపు పైన, నడుము పైన హీట్ ప్యాక్ పెట్టడం, వేడినీళ్ల వాటర్ బాటిల్ తో మసాజ్ చేయడం వంటి వాటితో పీరియడ్స్ నొప్పిని తగ్గించవచ్చు. అంతేకాదు వెచ్చని నీళ్ళతో స్నానం చేయడం కూడా నొప్పి నుండి ఉపశమనం కల్పిస్తుంది.
ఇవి తింటే, ఇలా చేస్తే పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తినడం, అల్లం టీ లేదా దాల్చిన చెక్క టీ తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నూనెతో ను, లేదా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తోను కడుపు, నడుముకు సున్నితంగా మసాజ్ చేసిన పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ చర్యలతో పీరియడ్స్ నొప్పికి చెక్
ఒత్తిడిని తగ్గించేలా సున్నితమైన వ్యాయామాలు చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. తగినంత నీరు తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్ నుండి బయటపడుతుంది. ఫలితంగా పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గుతుంది. ఇక బాలాసనం, సుప్త మత్స్యాసనం వంటి తేలికపాటి యోగాసనాలు చేయడం వల్ల, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల కూడా పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది.












Click it and Unblock the Notifications