టీ నుండి అన్నం దాకా పదేపదే వేడి చేసి తీసుకోకూడని పదార్ధాలు ఇవే!!

వండుకున్న పదార్థాలు మిగిలిపోతే ఫ్రిజ్లో పెట్టుకోవడం మళ్లీ వేడి చేసుకొని తినడం చాలా సర్వసాధారణంగా మన ఇళ్ళల్లో జరిగిపోతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం వండుకున్న ఆహార పదార్థాలను మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు. మరి ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను వేడి చేసి తింటే దానివల్ల అనేక అనర్ధాలు చోటుచేసుకుంటాయని డైటీషియన్లు చెబుతున్నారు.

వేడి చేసి తినకూడని ఆహారాలు
ఎందుకంటే కొన్ని ఆహారాలను మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల వాటి రుచి పోషక విలువలు పూర్తిగా పోతాయని కొన్ని ఆహార పదార్థాలను అస్సలు వేడి చేసుకుని తినకూడదని చెబుతున్నారు .మరి అటువంటి ఆహార పదార్థాలు ఏమిటనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

From tea to rice these foods that should not be reheated

పదేపదే వేడి చేసి తాగకూడని పానీయం
మనం వేడి చేసుకుని తీసుకోకూడని వాటిలో ముఖ్యమైనది టీ. టీలో యాంటీ ఆక్సిడెంట్లు పాలిఫినాల్స్ వంటి సున్నితమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి టీ రుచిని పెంచడంతోపాటుగా ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తాయి. టీ తయారు చేసినప్పుడు అందులో టానిన్లు, కాటెచిన్ల వివిధ సమ్మేళనాలు మళ్ళీ వేడి చేస్తే క్షీణిస్తాయి. టీలో కెఫిన్ ఉంటుంది. దీనిని పదే పదే వేడి చేయడం ఫలితంగా చిరాకు, నిద్ర భంగం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

వేడి చేసి తినకూడని కూర
మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినకూడని వాటిలో పాలకూర ఒకటి. పాలకూరను మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తినడం వల్ల అందులో ఉండే నైట్రేట్లు అమైనో ఆమ్లాలతో చర్య జరిపి నైట్రోసమైన్ లను ఏర్పరుస్తాయి. ఇవి క్యాన్సర్ కారకాలు కాబట్టి మళ్లీ మళ్లీ పాలకూరని ఉడికించుకొని తినడం ఏమాత్రం మంచిది కాదు.

మళ్ళీ మళ్ళీ వేడి చేసిన నూనె వాడకం డేంజర్
మనం తీసుకునే ఆహారాలలో వినియోగించే వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వినియోగించడం నూనెలో రసాయనకు మార్పులకు కారణం అవుతుంది. ఇవి హానికరమైన సమ్మేళనాలను తయారు చేసే హృద్రోగ వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి వంట నూనెను పదే పదే వేడి చేసి వినియోగించడం అస్సలు మంచిది కాదు.

వేడి చేసి తీసుకోకూడని వాటిలో ఇది చాలా ముఖ్యమైంది
పదేపదే వేడి చేసి తినకూడని వాటిలో అన్నం చాలా ముఖ్యమైనది. అన్నంలో సాధారణంగా కనిపించే బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అన్నాన్ని మళ్లీమళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ కు కారణం అయ్యే బ్యాక్టీరియా గా మారి అనారోగ్యానికి కారణం అవుతుంది. కాబట్టి అన్నాన్ని వేడి చేసి తినటం మానుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+