సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం.. ఒబేసిటీతో పాటు ఈ సమస్యలకు చెక్!

మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే వాటిలో సబ్జా గింజలు ఒకటి. ఇక ఈ వేసవిలో సబ్జా గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వేసవి తాపానికి తల్లడిల్లుతున్న ప్రతిఒక్కరికి సబ్జా గింజలతో బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అధిక వేడితో ఇబ్బంది పడేవారు రోజుకు మూడు సార్లు నానబెట్టిన సబ్జా గింజల నీళ్ళు తాగడం వలన వేడి నుండి మీ శరీరం చల్లబడి మంచి ఉపశమనం పొందుతారు.

అధిక బరువును తగ్గించడానికి సబ్జా గింజలు
అధిక బరువుతో సతమతం అయ్యేవారు అనేక ఆనారోగ్య సమస్యలకు లోనవుతుంటారు. వారు సబ్జా గింజల నీళ్లను తాగడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. కేలరీలు తక్కువగా కలిగిన సబ్జా గింజలలో ,ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఆకలిని తగ్గిస్తుంది, ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అధిక బరువు సమస్య సబ్జా గింజలను తీసుకుంటే పరిష్కారం అవుతుంది.

Full health with sabja seeds Check for obesity and these problems

గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది
గుండె సంబంధిత వ్యాధులున్న వారికి ఈ సబ్జా గింజలను నానబెట్టి తాగడం వలన గుండె జబ్బుల నుండి విముక్తి పొందుతారు. ఎందుకంటే సబ్జా గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.బీపీ తగ్గిస్తాయి. రక్త ప్రసరణకు దోహదపడతాయి. ఆర్థరైటిస్ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి.

చర్మ సంబంధిత వ్యాధులకు సబ్జా గింజలు
చర్మం పొడిబారకుండా మృదువుగా ఉండేందుకు సబ్జా గింజలు తోడ్పాడుతాయి , చర్మం పై నల్ల మచ్చలు ,మొటిమలు,గజ్జి , తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులున్న వారికి సబ్జా గింజల నీళ్ళు తాగడం వలన త్వరితగతిన మార్పు వస్తుంది అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అరికాళ్ళు పగుళ్ళు ,లేదా అరికాళ్ళలో మంటలు కలిగే వారికి కూడా పగుళ్లను ,మంటలను నియంత్రించడంలో సబ్జా గింజలు పనిచేస్తాయి.

సబ్జా గింజలను ఈ పద్ధతులో తగిన మోతాదులో తీసుకోండి
శరీరంలో సమస్యలు ఉన్నాయి అని ఎలా బడితే అలా సబ్జా గింజలను ఉపయోగించటం మంచిది కాదు.సబ్జా గింజలను తీసుకోవాలనుకుంటే మినిమం ఒక ఎనిమిది గంటలకు ముందుగా సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి బాగా నాని ఉబ్బిన సబ్జా గింజలను ఒక గ్లాసు నీళ్లలో గాని లేదా చల్లారిన పాలల్లో గాని లేదా నిమ్మకాయ రసంతో కానీ కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+