హాట్.. హాట్.. 'వెల్లుల్లి గుడ్డు కారం'.. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి..?
వేడి వేడి అన్నంలో 'వెల్లుల్లి గుడ్డు కారం' సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నోటికి రుచిగా ఉంటుంది. పెద్దలు, పిల్లలు ఈ ఫుడ్ ను తింటారు. మరి వెల్లుల్లి గుడ్డు కారం ఎలా తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి..? వెల్లుల్లి గుడ్డు కారానికి కావాల్సిన పదార్థాలు.. కోడిగుడ్లు, కారం - రుచికి సరిపడా(2 టేబుల్స్పూన్లు, వెల్లుల్లి, జీలకర్ర, నూనె, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఉప్పు తగినంత, పసుపు, కొత్తిమీర తరుగు తీసుకోవాలి.
తయారీ విధానం చూస్తే.. తయారీ విధానం కోసం.. ముందుగా వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి. ముందుగా మిక్సీలో కారం, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నూనె పోసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. తాలింపు గింజలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి కలపాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వాటిని పాన్లోని అంచుల వైపు ఉంచాలి. ఇప్పుడు పాన్ మధ్యలో నూనె ఉంటుంది.

అందులో కోడిగుడ్లు వేసి లైట్ గా కలిపి మూత పెట్టి ఉడికించాలి. కోడిగుడ్లు ఉడికించిన తర్వాత చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. గుడ్డును ముక్కలుగా చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, గుడ్డు మిశ్రమాన్ని కలిపి ఫ్రై చేసుకోవాలి. కోడి గుడ్లు ముక్కలు ఎర్రగా మారిన తర్వాత గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారం వేసి కలిపి మగ్గించాలి. ఆ తర్వాత చివరిలో కొత్తిమీర తరుగు వేస్తే వెల్లుల్లి గుడ్డు కారం రెడీ అయినట్లే..
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications