మేక పాలు తాగండి... మీరు వాడే అన్ని టాబ్లెట్లు విసిరికొట్టండి
మనదగ్గర ఎక్కువగా గేదె పాలను ఉపయోగిస్తారు. ఆవు పాలు అందుబాటులో ఉన్నా, వాటి ప్రయోజనాల గురించి తెలిసినా ఎవరూ ఉపయోగించరు. అలాంటి మేక పాల గురించి చెబితే ఉపయోగిస్తారా? అంటే వాడొచ్చు. ఎందుకంటే అవి పోషకాలకు ఖజానా లాంటివి. కొన్ని శతాబ్దాలుగా వీటిని వాడుతున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను మేక పాలు ఇస్తాయి. ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా వీటిని వాడతారు. పోషకాలతో నిండి ఉంటాయి. భాస్వరం, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. గుండెఆరోగ్యంగా ఉండేందుకు, ఎముకలు బలంగా ఉండేందుకు, అలాగే శరీరంలో బలమైన రోగనిరోధక వ్యవస్థ పెంపొందించడంలో మేక పాలది కీలక పాత్ర.
సులభంగా జీర్ణమవుతాయి
ఆవుపాలతో పోలిస్తే మేకపాలు సులభంగా జీర్ణమవుతాయి. వీటిల్లో అధిక స్థాయిలో మీడియం చైన్ కొవ్వు ఆమ్లాలు, చొన్న కొవ్వు గ్లోబుల్స్ ఉంటాయి. శరీరంలోకి తీసుకునే పదార్థాలను విచ్ఛిన్నం చేయడం, గ్రహించడం చాలా సులభం చేస్తాయి. జీర్ణ వ్యవస్థ సరిగాలేనివారు మేక పాలు తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఇమ్యునోగ్లోబులిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంటువ్యాధులన నుంచి కాపాడతాయి. క్రమం తప్పకుండా మేక పాలను తీసుకోవడంవల్ల శరీర రక్షణ వ్యవస్థ మొత్తం బలోపేతమవుతుంది.

బరువును తగ్గిస్తుంది
ఇందులో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. మేక పాలలో ఉండే ప్రొటీన్ అతిగా తినడాన్ని నివారిస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. శరీర ఛాయను మేనివంతంగా చేస్తుంది. మేక పాలలో అధికంగా ఉండే కొవ్వు పదార్థం చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చూస్తుంది. చర్మం మృదువుగా, సున్నితంగా, ప్రకాశవంతంగా మారుతుంది. కప్పు మేక పాలలో 12 శాతం తక్కువ లాక్టోస్ ఉంటుంది. పెరుగుగా మార్చినప్పుడు ఇది మరింతగా తగ్గుతుంది. లాక్టోస్ సెన్సిటివిటీ ఉన్నవారు మేకపాలు తాగొచ్చు.












Click it and Unblock the Notifications