కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే సూపర్ ఫుడ్స్

మనిషి శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైనవి. రక్తాన్ని శుద్ధి చేసేది ఇవే. ఎప్పటికప్పుడు రక్తంలో చేరే మలినాలను, టాక్సిన్స్ ను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. అంతేకాదు.. ఎర్ర రక్తకణాలను ప్రేరేపించే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి. సోడియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను నియంత్రిస్తాయి. వీటి పనితీరు మందగించకుండా చూసుకోవాలి. లేదంటే రక్తహీనతతోపాటు ఆక్సిజన్ వాహక సామర్థ్యం తగ్గుతుంది. సరిపడా మంచినీరు తాగుతుండటంతోపాటు వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడంద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.

పాలకూర : ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ B9 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని సమర్థిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని నివారిస్తాయి.

kidneys1

బాదం : బాదంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. అయితే వీటిల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవాలి. ​

క్వినోవా : క్వినోవాలో ప్రొటీన్‌, ఫైబర్‌, అమైవో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. అన్నం, రోటీలకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.

కాలే : క్రూసిఫెరస్‌ కుటుంబానికి చెందిన కూరగాయ ఇది. కాలేలో విటమిన్‌ A, C, ఐరన్‌, కాల్షియ వంటి పోషకాలు ఉంటాయి. కిడ్నీలకు కాలే సూపర్‌ ఫుడ్‌ అవుతుంది. సలాడ్లు, వంటల్లో చేర్చి తినొచ్చు.

బ్లూబెర్రీస్ : యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా కిడ్నీలకు జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

చియా విత్తనాలు : చియా సీడ్స్‌లో ఫైబర్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌, మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మూత్రపిండాల పనితీరు సమర్థంగా ఉండేలా చూస్తాయి. సలాడ్లు, పుడ్డింగ్స్‌, స్మూతీస్‌లో వీటి యాడ్ చేసుకొని తినొచ్చు.

పప్పు : పప్పులో డైటరీ ఫైబర్, ప్రొటీన్, ఐరన్ ఉండి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. డైట్‌లో తరచుగా పప్పు తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

చిలగడదుంపలు : చిలగడదుంపల్లో ఫైబర్‌, విటమిన్‌ ఏ, సి ఉంటాయి. బంగాళదుంపలతో పోలిస్తే పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బ్రకోలీ : బ్రకోలీలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, ఫైబర్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. శరీరంలోని వాపును తగ్గించడంద్వారా మూత్రపిండాలు బాగుగా పనిచేసేలా చూస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+