మీ శరీరాన్ని డీటాక్స్ చేసే ఆహారాలు ఇవే..!
శరీరం కూడా ఓ మెషిన్ లాంటిదే అని వైద్యులు చెబుతారు. నిత్యం మన శరీరంలోని భాగాలు పని చేస్తూనే ఉంటాయి. మన బాడీలోని మలినాల్ని బయటకు పంపుతూనే ఉంటాయి. పండ్లు, కూరగాయలు, తగినంత నీరు తాగడం ద్వారా మన శరీరంలోని మలినాలను త్వరగా బయటకు పంపిచ్చొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రోకోలీ, క్యాబేజీ, కాలిఫ్లవర్ లాంటి కూరగాయలు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహజసిద్ధంగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని క్రూసిఫెరస్ కూరగాయలు అని పిలుస్తారట.
బ్రోకోలీ, క్యాబేజీ, కాలిఫ్లవర్ లో సల్ఫర్ కాంపౌండ్స్, గ్లూకోసినోలేట్స్ అనే పదార్థాలు ఉంటాయట. ఇవి శరీరంలోకి వెళ్లి సల్ఫర్ మాలిక్యూల్స్ గా మారి కాలేయంలోని డీటాక్స్ ఎంజైమ్స్ ను చురుకుగా చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. దీనివల్ల లివర్ విషపదార్థాలను సులభంగా బయటకు పంపుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బ్రోకోలీ, క్యాబేజీ, కాలిఫ్లవర్ లో ఉన్న ఇండోల్-3-కార్బినాల్, సల్ఫోరాఫేన్ అనే రసాయనాలు శరీరంలోని చెడు పదార్థాలను బయటకు వెళ్లడంలో సాయపడతాయట.
ఇక వీటిలో విటమిన్ సీ, ఈ, కే లు అధికంగా ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే ఈ కూరగాయల్లో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దాంతో కిడ్నీ, లివర్, చర్మం డీటాక్స్ మెరుగవుతుందని వివరిస్తున్నారు. అంతేకాక బ్రోకోలీ, క్యాబేజీ, కాలిఫ్లవర్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడమే కాకుండా మలం ద్వారా టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా..లివర్ క్లీన్ గా మారడంతోపాటు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని.. హార్మోన్ బ్యాలెన్స్ అవుతాయని.. చర్మ కాంతి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
-
బీరకాయ పెరుగు పచ్చడి.. ఇలా చేస్తే రుచి, ఆరోగ్యం కూడా! -
అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు, వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం












Click it and Unblock the Notifications