గ్రీన్ సెక్స్ కు ఓటేస్తున్న జెన్ జీ - ఎందుకు ట్రెండ్ అవుతుంది?

శృంగారంలోని మాధుర్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే.. అది హద్దులు లేని అనంత లోకమై ఉండాలి" అంటారు కొందరు కవులు. కానీ, ఆ ఏకాంతపు లోకంలో పొందే సంతృప్తి కేవలం ఇద్దరికే పరిమితం కాకూడదని, అది ఈ ప్రపంచానికి కూడా మేలు చేయాలని నేటి తరం యువత ఆకాంక్షిస్తోంది. జెట్ స్పీడ్‌తో దూసుకుపోయే 'జెన్-జీ' (Gen Z) ఆలోచనలు ఇప్పుడు ప్రకృతి పరిరక్షణ దిశగా మళ్లాయి. అది కూడా వారి అత్యంత సన్నిహితమైన శృంగార సమయంలో కావడం విశేషం.

శృంగారం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే ఒక వర్ణనాతీతమైన, పవిత్రమైన ఘట్టం. అయితే, ఆ మధుర క్షణాల్లో మనం వాడే వస్తువులు, అనుసరించే పద్ధతులు పర్యావరణంపై పెను ప్రభావం చూపుతాయని నేటి యువత గుర్తిస్తోంది. పడకగదిలో వాడి పారేసే ప్లాస్టిక్ ప్యాకేజింగ్, రసాయనాలతో కూడిన ఉత్పత్తులు భూమికి భారంగా మారుతున్న వేళ.. ప్రకృతికి కీడు చేయని 'గ్రీన్ సెక్స్' (Green Sex) వైపు యూత్ మొగ్గు చూపుతోంది.

Green Sex The Hottest Gen Z Trend of 2026 Focused on Eco-Friendly Intimacy amp amp Sustainability

పర్యావరణాన్ని కాపాడటం అంటే కేవలం చెట్లు నాటడం, ప్లాస్టిక్ కవర్లు వాడకపోవడం మాత్రమే కాదు.. మన అత్యంత సన్నిహిత క్షణాల్లో కూడా ప్రకృతికి హాని చేయకుండా ఉండటమే 'గ్రీన్ సెక్స్'. వినడానికి వింతగా ఉన్నా, 2026లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ట్రెండ్ ఇదే. పర్యావరణంపై అమితమైన ప్రేమ చూపే 'జనరేషన్ జెడ్' (Gen Z) మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు మిలీనియల్స్ కూడా తెగ ఫాలో అయిపోతున్నారు.

పడకగదిలో ప్లాస్టిక్ వద్దు!

మనం రోజూ వాడే కండోమ్‌లు, లూబ్రికెంట్ ప్యాకెట్లు, రకరకాల సెక్స్ టాయ్స్ తయారీలో విపరీతమైన ప్లాస్టిక్, రసాయనాలు ఉపయోగిస్తుంటారు. ఇవన్నీ భూమిలో అంత సులభంగా కలిసిపోవు. మనం వాడి పారేసే ఈ వస్తువుల వల్ల పర్యావరణంపై పడే 'కార్బన్ ఫుట్‌ప్రింట్' (కాలుష్యం) చాలా ఎక్కువ. అందుకే, ఈ చెత్తను తగ్గించి ప్రకృతికి దగ్గరగా ఉండటమే 'గ్రీన్ సెక్స్' ముఖ్య ఉద్దేశం అని ప్రముఖ బ్రాండ్ బెల్లెసా బొటిక్ చెబుతోంది.

వేగన్ కండోమ్స్.. సేంద్రీయ లూబ్రికెంట్స్!

గ్రీన్ సెక్స్ అంటే పెద్ద కష్టమైన పనేమీ కాదు.. మనం వాడే ఉత్పత్తుల్లో చిన్న మార్పులు చేసుకుంటే చాలు. సాధారణ లాటెక్స్ కండోమ్‌లకు బదులుగా పారాబెన్స్ వంటి రసాయనాలు లేని 'వేగన్' (Vegan) కండోమ్‌లను ఎంచుకోవడం ఒక పద్ధతి. అలాగే గొర్రెల ప్రేగుల నుంచి తయారయ్యే 'ల్యాంబ్‌స్కిన్' కండోమ్‌లు కూడా పర్యావరణానికి మేలు చేస్తాయి (కానీ ఇవి కేవలం గర్భాన్ని మాత్రమే ఆపుతాయి, జబ్బులను కాదు). పెట్రోలియం ఆధారిత లూబ్రికెంట్లకు బదులుగా వాటర్ బేస్డ్ లేదా సేంద్రీయ పదార్థాలతో తయారైన లూబ్స్ వాడటం వల్ల శరీరానికి, భూమికి కూడా మంచిదే.

ఆరోగ్యానికి కూడా ప్లస్ పాయింట్!

పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వల్ల కేవలం ప్రకృతికే కాదు, మన శరీరానికి కూడా బోలెడు లాభాలు ఉన్నాయి. కెమికల్స్ తక్కువగా ఉండటం వల్ల సున్నితమైన చర్మం ఉన్నవారికి మంట, దురద, అలర్జీలు రావు. పీహెచ్ (pH) అసమతుల్యత వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల భయం కూడా తగ్గుతుంది. చాలా కంపెనీలు ఇప్పుడు ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తగ్గించి, రీసైకిల్ చేసే వీలున్న పదార్థాలను వాడుతున్నాయి.

ఒకప్పుడు దీనిని వింతగా చూసిన వారు కూడా, ఇప్పుడు ప్రకృతికి మేలు చేసే ఈ పద్ధతిని అభినందిస్తున్నారు. బెడ్ రూమ్ లో మనం చేసే చిన్న మార్పులు రేపటి పచ్చని ప్రపంచానికి పునాది అవుతాయన్నదే ఈ 'గ్రీన్ సెక్స్' ట్రెండ్ ఇచ్చే సందేశం. మొత్తానికి 2026లో హార్ట్ అండ్ హాట్ టాపిక్ ఇదే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+