పచ్చి బఠాణీ టమాటా కర్రీ.. నిమిషాల్లోనే రెడీ..!
పచ్చి బఠాణీలతో టమాటా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. సాధారణంగానే టమాటా కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ మిశ్రమంలో పచ్చి బఠాణీ వేసి చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవెల్ ఉంటుంది. ఈ పచ్చి బఠాణీ టమాటో కర్రీని పెద్దలు, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీల్లోకి బాగుంటుంది. అలాగే తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో ఈ కర్రీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి..
పచ్చి బఠాణీ టమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పచ్చి బఠాణీలు ఒక కప్పు, టమాటోలు అర కిలో, ఉల్లిపాయలు రెండు, పచ్చిమిర్చి నాలుగు, వెల్లుల్లి రెబ్బలు 20, నూనె తగినంత, మెంతులు తగినన్ని, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం రుచికి సరిపడా, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు, కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి.
పచ్చి బఠాణీ టమాటా కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి బఠాణీలను ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో మెంతులు, జీలకర్ర, ఆవాసి వేసి వేయించుకోవాలి. అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో పచ్చి బఠాణీలు ఫ్రై చేయాలి. అందులో ఇప్పుడు టమాటా ముక్కలను వేసి బాగా కలపి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, కారం వేసి ఉడికించుకోవాలి. అలా బఠాణీ మెత్తగా ఉడికేంత వరకూ కుకింగ్ చేసుకోవాలి. చివరగా ధనియాల పొడి, కొత్తిమీర తరుగు వేయాలి. అంతే సూపర్ టేస్టీ పచ్చి బఠాణీ టమాటా కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications