జామపండు తింటే ఇవి మీ దగ్గరకు కూడా రావు
జామపండు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగివుంటుంది. ఇందులో ఉండే లైకోపిన్, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్షిడెంట్ల వంటి పోషకాలున్నాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు జామ ఉపయోగపడుతుంది. గుండె సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది జామపండు.
విరేచనాల చికిత్స కుడా జామ ఆకులను వాడతారు. ఈ పండు తినడంవల్ల శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యత బాగుంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్, చెడు కాలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణమవుతుంది. జామపండువల్ల ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది
జామపండు పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పండు. ఇందులో చాలా ముఖ్యమైన పోషకాలున్నాయి. జామపండులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. సాధారణ ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది.
మధుమేహం నివారణ
ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులు పెరగడకుండా నిరోధిస్తుంది. దీంతోపాటు ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్లే రక్తంలో చక్కెరస్థాయి పూర్తి నియంత్రణలో ఉంటుంది.
గర్భధారణ సమయంలో..
జామను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి9 శిశువు నాడీ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. అంతేకాదు. నరాలకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో జామపండు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.

ఒత్తిడి నుంచి నివారణ
జామపండు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ పండులో ఉండే మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
జామలో కేలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఈ పండులో చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉండటంతో దీన్ని తరుచుగా తినడంవల్ల సులభంగా బరువు తగ్గొచ్చు.












Click it and Unblock the Notifications