ఈ డ్రింక్స్ తో జుట్టు ఊడిపోతుంది.. బట్టతల అవుతుంది.. జాగ్రత్త!
చాలామంది జుట్టు ఆరోగ్యంగా ఉండాలని, బాగా పెరగాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు ఊడిపోతూనే ఉంటుంది. జుట్టు ఊడిపోవడానికి గల కారణాలు వారికి ఏ మాత్రం అర్థం కాదు. జుట్టు రాలడం, బట్టతల రావడం, బలహీనంగా జుట్టు మారడం జన్యు శాస్త్రం ప్రకారం హార్మోన్ల అసమతుల్యత కారణంగా జరుగుతుంది. అయితే జుట్టు రాలిపోవడానికి కొన్ని మందుల వాడకం యొక్క దుష్ప్రభావం కూడా ఉంటుంది.
ఈ డ్రింక్స్ తో జుట్టు ఆరోగ్యానికి హాని
ఇక ఇవి మాత్రమే కాకుండా కొన్ని రకాల డ్రింక్స్ ప్రతిరోజు తాగడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది అని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. చాలామంది ప్రతిరోజూ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఈ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు కూడా హాని చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.

కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగటం వలన బట్టతల
ప్రతిరోజు కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల మనకు తెలియకుండానే బట్టతల సమస్య వస్తుందని చెబుతున్నారు. బీజింగ్ లోని సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు ఎనర్జీ డ్రింక్స్ మరియు షుగర్ తో ఉన్న డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని తమ పరిశోధన ద్వారా తేల్చారు.
వీరిలో జుట్టు రాలిపోయే ప్రమాదం 42% ఎక్కువ
ఈ యూనివర్సిటీ పరిశోధకులు 13 నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్న వారిలో ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వారి జుట్టు ఎక్కువగా ప్రభావితమైందని గుర్తించారు. మొత్తం 1000 మందిపై జరిపిన పరిశోధనలో వారానికి మూడు లీటర్ల కంటే ఎక్కువ ఎనర్జీ డ్రింక్ వారు తాగినట్టు గుర్తించారు. వీరిలో జుట్టు రాలిపోయే ప్రమాదం 42% ఎక్కువ ఉందని పరిశోధన ద్వారా తేల్చారు.
ఇవి తింటే కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం
ఇక ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినే అలవాటు ఉన్నవారిలో కూడా జుట్టు రాలడంతో పాటు, డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం ద్వారా తేలిందని చెప్పారు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా అందుకు కారణం అవుతుందని, ఏది పడితే అది తింటే అది జుట్టు ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుందని చెబుతున్నారు. ఇక కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగేవారు జుట్టు ఊడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్న కారణంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications