Happy Chocolate Day: ఈ 5 నగరాలు చాక్లెట్ ప్రేమికులకు స్వర్గధామాలు!

Happy Chocolate Day: చాక్లెట్ ప్రియులకు ఫిబ్రవరి 9 చాలా ప్రత్యేకమైన రోజు. వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా జరుపుకునే ఈ 'చాక్లెట్ డే' రోజున నోరు తీపి చేసుకోవడమే కాకుండా.. అసలు ఆ రుచికరమైన చాక్లెట్లు ఎక్కడ పుడతాయో తెలుసుకోవడం కూడా ఓ అద్భుతమైన అనుభూతి. మన దేశంలో చాక్లెట్లకు పెట్టింది పేరుగా నిలిచే 5 అందమైన గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ చాక్లెట్ డే రోజున మీరు విహారయాత్ర ప్లాన్ చేయాలనుకుంటే ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్.

1. ఊటీ, తమిళనాడు (చాక్లెట్ మ్యూజియం ప్రత్యేకం)
నీలగిరి పర్వతాల మధ్య ఉండే ఊటీ.. హ్యాండ్‌మేడ్ చాక్లెట్లకు ప్రపంచ ప్రసిద్ధి. ఇక్కడి బేకరీల్లో డార్క్, మిల్క్, వైట్ చాక్లెట్లు మాత్రమే కాకుండా.. జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ నింపిన వెరైటీలు దొరుకుతాయి. ముఖ్యంగా ఇక్కడి 'చాక్లెట్ మ్యూజియం' తప్పక చూడాల్సిన ప్రదేశం. కోకో గింజల నుంచి చాక్లెట్ తయారయ్యే వరకు పూర్తి ప్రయాణాన్ని ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు చాక్లెట్ దుస్తులు ధరించిన బొమ్మలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

Happy Chocolate Day 5 Best Indian Cities for Chocolate Lovers to Visit in Valentines Week Full Details

2. కూర్గ్, కర్ణాటక (కోకో తోటల మధ్య)
కూర్గ్ కేవలం కాఫీకే కాదు, కోకో తోటలకు కూడా నిలయం. ఇక్కడ పర్యాటకులు నేరుగా కోకో ఫామ్‌లను సందర్శించవచ్చు. చాక్లెట్ ఎలా తయారు చేస్తారో స్వయంగా నేర్చుకోవడమే కాకుండా, తాజా కోకో సువాసనల మధ్య ఇంట్లో తయారుచేసిన చాక్లెట్లను రుచి చూడవచ్చు.

3. మున్నార్, కేరళ (ప్రీమియం ఫ్లేవర్స్)
కేరళలోని మున్నార్‌లో నాణ్యమైన కోకో గింజలు పండుతాయి. ఇక్కడి రిసార్టులు 'చాక్లెట్ టూరిజం'ను బాగా ప్రోత్సహిస్తాయి. ఇక్కడ సాధారణ చాక్లెట్లతో పాటు పీచ్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బాదం ఫ్లేవర్లలో లభించే చాక్లెట్లు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

4. పుదుచ్చేరి (ఫ్రెంచ్ స్టైల్ చాక్లెట్లు)
పుదుచ్చేరిలో ఫ్రెంచ్ సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి కేఫ్‌లలో లభించే పేస్ట్రీలు, ట్రఫుల్స్, ఆర్టిసానల్ చాక్లెట్లు చాలా విభిన్నంగా ఉంటాయి. సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసే ఇక్కడి చాక్లెట్ స్టూడియోలు వీగన్(శాకాహార), గౌర్మెట్ వెరైటీలను అందిస్తాయి.

5. అరకు వ్యాలీ, ఆంధ్రప్రదేశ్ (తెలుగు రాష్ట్రాల గర్వకారణం)
మన విశాఖపట్నం సమీపంలోని అరకు వ్యాలీలో కూడా అద్భుతమైన ఆర్గానిక్ చాక్లెట్లు తయారవుతాయి. ఇక్కడ పండే స్వచ్ఛమైన కోకోతో పీనట్ బటర్, కొబ్బరి, హనీ-ఆల్మండ్ ఫ్లేవర్లలో చాక్లెట్లు తయారు చేస్తారు. ముఖ్యంగా అరకు కాఫీ ఫ్లేవర్ కలిపిన చాక్లెట్లు చాక్లెట్ ప్రియులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+