మద్యం తాగే అలవాటుందా?
తల్లిదండ్రులకు ఏ అలవాటు ఉంటుందో పిల్లలకు కూడా అదే అలవాటవుతుంది. అందుకే అన్నీ మంచి అలవాట్లే ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కొన్ని అలవాట్లు జన్మతహ వస్తాయి. మంచివైతే పర్వాలేదు.. మంచివి కాకపోతే వయసు పెరిగేకొద్దీ ఆ అలవాట్లను మార్చుకునేలా చేస్తారు. అందుకే కొన్ని పనులు పిల్లల ముందు చేయవద్దు అని నిపుణులు చెబుతుంటారు.
గొడవల ప్రభావం
ఇంట్లో ప్రతిరోజు దంపతుల మధ్య జరిగే గొడవల వల్ల చిన్నారుల మనస్తత్వంపై ప్రభావం పడుతుంది. పెద్దలు ఏం చేస్తారో పిల్లలు కూడా అవే చూసి నేర్చుకుంటారు. అలాగే పెద్దవారి ఆరోగ్యం కూడా చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మద్యం తాగే అలవాటుంటే పిల్లలకు కూడా అలవాటవుతుంది. ఇటీవలే జరిగిన ఒక పరిశోధనలతో ఈ విషయం వెల్లడైంది. తల్లిదండ్రుల్లో ఒకరికి మందుకొట్టే అలవాటున్నా పిల్లలు మద్యానికి బానిసలుగా మారతారని తేలింది.

బీపీ, షుగరు బారిన
ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి పుట్టే పిల్లల్లో అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్, ఎక్కువగా శుద్ధి చేసిన కార్భోహైడ్స్, కొవ్వుతో కూడి ఆహార పదార్థాలను తీసుకోవాలనే కోరిక అధికంగా ఉంటుందని నిపులు తెలియజేస్తున్నారు. ఇవి చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, చిన్న వయసులోనే మధుమేహం, బీపీ, గుండె సంబంధిత రోగాలబారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మద్యం అలవాటు ఉంటే తల్లితండ్రులు మానుకోవాలని సూచిస్తున్నారు.
పిల్లలు కలగడం కష్టం
మద్యంతాగే పురుషుల్లో సంతానోత్పత్తిపైకూడా ప్రభావం పడుతుంది. విపరీతంగా తాగే అలవాటున్నవారిలో శుక్ర కణాల సంఖ్య తగ్గుతుంది. దీర్ఘకాలంలో పురుషులకు సంతానలేమికి కారణంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ తాగే అలవాటున్నవారికి మాత్రం ఇంకా ఎక్కువ ప్రమాదాలు పొంచివున్నాయని చెబుతున్నారు. ఈ రెండూ తాగే అలవాటున్నవారు మానుకోవాలని అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications