Ghee:గర్భిణీలకు నెయ్యి మంచి చేస్తుందా.. చేటు చేస్తుందా..?
గర్భిణీలు నెయ్యికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
పెళ్లయిన ప్రతి మహిళా అమ్మ అని పిలుపించుకోవాలనుకుంటుంది. గర్భం దాల్చిన స్త్రీ తన కడుపులో బిడ్డ పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వారి ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆహారం తీసుకునే ముందు తాము ఆ ఆహారం తీసుకోవచ్చా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. సాధారణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకున్న ఫర్వాలేదు కానీ గర్భంతో ఉన్న సమయంలో మాత్రం తాను తీసుకోబోయే ఆహారం తనకే కాదు కడుపులో ఉన్న బిడ్డపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆహారం తీసుకోకుడదో అన్న అంశంపై ఇప్పుడు చూద్దాం.

నెయ్యి ఎందుకు తీసుకోకూడదు
గర్భంతో ఉన్న మహిళలు తమ ఫుడ్ మెనూలో ఎలాంటి ఆహారం ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అన్న వివరాలను వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలి. వైద్యుడు సలహా మేరకు ఫుడ్ తీసుకుంటే అటు తల్లి ఇటు బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇక గర్భంతో ఉన్న స్త్రీలు నెయ్యి తీసుకోవచ్చా లేదా.. అనే అంశం గురించి చర్చిద్దాం. సాధారణంగా మహిళలు నెయ్యి ఎక్కువగా తీసుకోకూడదని చెబుతారు. నెయ్యి అధిక మోతాదులో తీసుకుంటే మహిళలు పలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక గర్భధారణ సమయంలో నెయ్యి అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గర్భధారణలో నెయ్యి వినియోగం..
గర్భధారణ సమయంలో మహిళలు నెయ్యి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. దీంతో పెద్ద సమస్యే వచ్చి పడుతుంది. నెయ్యిలో ఉన్న క్రొవ్వు పదార్థాలు బరువును పెంచుతాయి. నెయ్యి ఎక్కువగా తీసుకుంటే జీర్ణసమస్యలు కూడా అధికమవుతాయి. గర్భం దాల్చిన మహిళల్లో ఇది విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలను తీసుకొస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో నెయ్యి వినియోగం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత వ్యాధులకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

కాలేయంపై ప్రభావం
కొంత మంది స్త్రీలలో కాలేయం చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి వారు నెయ్యి తీసుకుంటే అది జీర్ణం కాదు. దీంతో చాలా ఇబ్బంది పడతారు. తద్వారా చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే గర్భంతో ఉన్న మహిళలు వీలైనంత వరకు నెయ్యికి దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. తద్వారా కడుపులో బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నెయ్యి ఎంత ఇష్టంగా ఉన్నా... ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు మాత్రం నెయ్యి పట్ల కాస్త కంట్రోల్‌గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు.












Click it and Unblock the Notifications