ఐసీఎంఆర్ చెప్పిన ఆయుష్షును పెంచే ఆరోగ్య సూత్రాలు.. పాటిద్దామా!

శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు నూతన ఉత్సాహంతో యంగ్ గా కనిపిస్తారు. చాలామంది పెద్ద వయసు అయినప్పటికీ వారి వయసు కంటే చిన్నగా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. అయితే వారు అలా ఎందుకు ఉన్నారు? వారిలా మిగతావారు ఎందుకు ఉండలేకపోతున్నారు ? అంటే వారి జీవన విధానమే అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

ఆయుష్షు పెంచే ఆరోగ్య సూత్రాలు
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా జీవించవచ్చని ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఐ సి ఎం ఆర్ సూచనల ప్రకారం ఆయుష్షును పెంచే ఆరోగ్య సూత్రాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుష్షు పెరగాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అన్ని పోషకాలు ఒకే ఆహారంలో లభించవు కాబట్టి చక్కని పోషకాలు ఉండే విభిన్న ఆహారాలను తీసుకోవాలి.

Health principles that increase life expectancy as suggested by ICMR

ఇవి తప్పక పాటించండి
ప్రతిరోజు కనీసం రెండు లీటర్ల నీటిని అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. సీజన్లో వచ్చే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో కెఫీన్ తీసుకోవడాన్ని నిరోధించాలి. అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకునేలా చూసుకోవాలి. తక్కువ కొవ్వులను వినియోగించాలి. ఆహారంలో ఉప్పు వాడకండి తగ్గించాలి. లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాల వంటి సుగంధ ద్రవ్యాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం
చక్కెరను వినియోగించకూడదు. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇక వివిధ రకాల నూనెలను తినకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ తిన్న మితంగా వాడాలి. పాలిష్ చేసిన ధాన్యానికి బదులు ముడి ధాన్యాలు వాడితే మంచిది. పండ్ల రసాలు తాగే బదులు పండ్లు తింటే మంచిది. బయట ఆహారం కంటే ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాలను తినడం మంచిది.

ఇలా చెయ్యండి.. ఆయుష్షు పెరుగుతుంది
ఇల్లు ఆఫీసులలో లిఫ్ట్ వినియోగానికి బదులు మెట్లు ఎక్కితే మంచిది. భోజన షెడ్యూల్ ఎప్పుడు ఒకే విధంగా ఉండేలా చూసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ప్రతి రోజు ధ్యానం చేయాలి. రోజు వ్యాయామం చేయాలి. స్క్రీన్ టైం తగ్గించి స్వీయ సమయాన్ని పెంచుకోవాలి. ఎక్కువ గంటల పాటు ఒకే చోట కూర్చొని పని చేయకూడదు. మధ్య మధ్యలో తప్పనిసరిగా బ్రేక్ తీసుకోవాలి.
.
ఉత్సాహంగా, ఆరోగ్యంగా బ్రతకాలంటే ఇవి చెయ్యండి
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి సూర్యకాంతిని ఎంజాయ్ చేయాలి. శరీరానికి కావాల్సిన విటమిన్ డీ అందేలా చూసుకోవాలి, ఆహార కల్తీ కాకుండా చూసుకోవాలి . ఇక వీటిని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుంది ఉత్సాహంగా సంతోషంగా జీవించడానికి అవకాశం దొరుకుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+