vitamin B-complex లోపిస్తే ఇన్ని ఆరోగ్య సమస్యలా?
B-కాంప్లెక్స్ విటమిన్లు ఎనిమిది ప్రధాన విటమిన్ల సమూహం. వీటిలో విటమిన్ B1 (థయామిన్), B2 (రిబోఫ్లావిన్), B3 (నయాసిన్), B5 (పాంటోథెనిక్ ఆమ్లం), B6 (పైరిడాక్సిన్), B7 (బయోటిన్), B9 (ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్), మరియు B12 (సయానోకోబాలమిన్) ఉన్నాయి. ఈ విటమిన్లు శరీరంలో వివిధ ఆహార పదార్థాలను శక్తిగా మార్చడంలో, నాడీ వ్యవస్థ పనితీరులో, మరియు రక్తకణాల ఉత్పత్తిలో ముఖ్యపాత్ర వహిస్తాయి. B-కాంప్లెక్స్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఎందుకంటే ఈ విటమిన్లు శరీరంలోని అనేక కీలక ప్రాసెస్‌లకు అవసరం.
1. ఆరోగ్య సమస్యలు - విటమిన్ B1 (థయామిన్) లోపం:
థయామిన్ శరీరంలో శక్తి ఉత్పత్తికి కీలకం. థయామిన్ లోపం వల్ల బెరిబెరీ అనే వ్యాధి వస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. వీటిల్లో వెట్ బెరిబెరీ వ్యాధి గుండె, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలకు దారి తీస్తుంది, దాంతో గుండె జబ్బులు, నడకలో కష్టాలు కలుగుతాయి. డ్రై బెరిబెరీ వల్ల నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది, ముఖ్యంగా కాళ్లలో నెమ్మదిగా మెదడుకు సిగ్నల్స్ పంపడంలో లోపం ఏర్పడుతుంది.

2. విటమిన్ B2 (రిబోఫ్లావిన్) లోపం:
రిబోఫ్లావిన్ శరీరంలో ఎనర్జీ ఉత్పత్తికి, చర్మ ఆరోగ్యానికి, మరియు కంటి దృష్టి క్షమతకు అవసరం. రిబోఫ్లావిన్ లోపం వల్ల చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం, నోటి మూలలు పొడబడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. కళ్ళు ఎర్రబారడం, కంటి నొప్పి, మరియు కంటి వెలుతురు సమస్యలు రావచ్చు.
3. విటమిన్ B3 (నయాసిన్) :
విటమిన్ B3 లోపం వల్ల పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది, ఇది నాలుగు ప్రధాన లక్షణాలతో గుర్తించబడుతుంది. వాటిల్లో డయేరియా , చర్మ సమస్యలు, మతిస్థిమితం కోల్పోతారు. దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రత పెరిగి ఒక్కొసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది.
4. విటమిన్ B5 (పాంటోథెనిక్ యాసిడ్) లోపం:
విటమిన్ B5 లోపం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది, కానీ తగినంత తీసుకోకపోతే శరీరంలో శక్తి ఉత్పత్తి తగ్గిపోతుంది, తద్వారా మానసికంగా మరియు శారీరకంగా అలసటను అనుభవిస్తారు. చర్మ పొడిబారడం, తలనొప్పి, మరియు ఆహార జీర్ణం సమస్యలు వస్తాయి.
5. విటమిన్ B6 (పైరిడాక్సిన్) :
విటమిన్ B6 లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిల్లో ప్రధానంగా నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి. అవయవాలు సరిగా పనిచేయకపోవడం, కుంగిపోయిన భావన, డిప్రెషన్, రక్తహీనత వికారం, జీర్ణకోశ ఇబ్బందులు తలెత్తుతాయి.
6. విటమిన్ B7 (బయోటిన్) :
విటమిన్ B7 శరీరంలో చర్మం, జుట్టు, కురుల ఆరోగ్యానికి అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, మొటిమలు రావడం. అలసట, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి.
7. విటమిన్ B9 (ఫోలేట్) :
విటమిన్ B9 లోపం వల్ల రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది, తద్వారా మెగాలోబ్లాస్టిక్ అనీమియా అనే వ్యాధి వస్తుంది. ఇది అలసట, శరీరంలో బలహీనతకు దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఫోలేట్ లోపం వల్ల పుట్టబోయే శిశువుకు నరాల సమస్యలు రావచ్చు.
8. విటమిన్ B12 (సయానోకోబాలమిన్) లోపం:
B12 లోపం వల్ల కూడా అనీమియా, అలాగే నాడీ సమస్యలు రావచ్చు. ఇది ఎక్కువగా మాంసాహారం తినని వారిలో కనిపిస్తుంది. దీని కారణంగా మతిస్థిమితం కోల్పోవడం, నొప్పి, నరాల పనితీరు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.
B-కాంప్లెక్స్ లోపం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. సరైన ఆహారం, ముఖ్యంగా కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, మరియు మాంసాహారం తీసుకోవడం ద్వారా ఈ లోపాలను నివారించవచ్చు. B-కాంప్లెక్స్ విటమిన్లు శరీర ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మరియు శక్తి ఉత్పత్తికి అవసరమైనవి కాబట్టి, ఈ విటమిన్లను సరియైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం.
గమనిక : ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications