ఆహారంలో ప్రోటీన్ లోపం ఉంటే శరీరంలో వచ్చే సమస్యలివే!
ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం లోపల పోషకాలు ఉండాలి. ముఖ్యంగా ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండాలి ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రోటీన్ లోపం వల్ల శరీరం ఎన్ని రకాల సమస్యలకు గురవుతుంది, ప్రోటీన్ లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది అనే అంశాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
ప్రోటీన్ లోపంతో అనారోగ్య సమస్యలు
ప్రోటీన్ లోపం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్ మన శరీరానికి శక్తిని ఇస్తుంది. ఆకలి తగ్గిస్తుంది. తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే మీరు బలహీనంగా తయారవుతారు. ఏ చిన్న పని చేసిన అలసటకు గురవుతారు. ఇక ప్రోటీన్ లోపం కారణంగా ఎముకల బలం కూడా తగ్గిపోతుంది. చిన్నపాటి ఇబ్బందులకు కూడా ఎముకలు విరిగిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ప్రోటీన్ లోపంతో జరిగేదిదే
ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే విపరీతంగా జుట్టు రాలిపోతుంది. జుట్టు బలహీన పడుతుంది. కావలసినంత ప్రోటీన్ లేకపోతే చర్మ సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారుతుంది. ప్రోటీన్ లోపం ఎక్కువగా ఉంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా తరచూ అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇక పిల్లలలో కూడా ప్రోటీన్ లోపం వారి ఎదుగుదలను నిరోధిస్తుంది. పిల్లలు మంచిగా పెరగరు. వారి గ్రోత్ లో మందగమనం కనబడుతుంది.
ప్రోటీన్ లోపం ఉంటే నొప్పులు, వాపులు
ప్రోటీన్ లోపంతో విపరీతంగా బరువు తగ్గిపోతారు. ప్రోటీన్ శరీరానికి కావలసిన అమైనో ఆమ్లాలను అందిస్తుంది. ప్రోటీన్ మన శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే శరీర కణజాలాలలో ద్రవం పెరిగి కాళ్లు, చేతులు, పొట్ట వాపుకు గురవుతాయి. నొప్పులు వస్తాయి. గోళ్ళు విరిగిపోవడం, చర్మం డల్ గా మారడం, జుట్టు ఊడిపోవడం వంటి అనేక సమస్యలు ప్రోటీన్ లోపం వల్లే వస్తాయి.
ప్రోటీన్ లోపంతో కండరాలకు నష్టం, మూడ్ స్వింగ్స్
ప్రోటీన్ లోపంతో కండరాల నష్టం జరుగుతుంది. తగినంత ప్రోటీన్స్ శరీరంలో లేకపోతే మూడ్ స్వింగ్స్ వస్తాయి. చిరాకు, బాధ, కోపం వంటి భావోద్వేగాలు కంట్రోల్ కావు. ప్రోటీన్ లోపం ఉంటే చిన్న చిన్న గాయాలు కూడా నయం కావడం ఆలస్యం అవుతుంది. కనుక ప్రోటీన్ లోపం తీవ్రంగా ఉంటే కచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలి.












Click it and Unblock the Notifications