Health tips: మంచి ఇమ్యూనిటీ బూస్టర్.. అద్భుతమైన పండు బొప్పాయి; బోలెడు హెల్త్ బెనిఫిట్స్!!

బొప్పాయి పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్. బొప్పాయి పండు లో ఉన్నన్ని విటమిన్లు మరెందులోనూ లేవంటే అతిశయోక్తి కాదు. బొప్పాయి పండు అన్ని కాలాలలో, అందరూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం తినగలిగిన పండు. బొప్పాయి పండుని నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అసలు ఇంతకీ బొప్పాయి పండులో ఉండే విటమిన్లు ఏమిటి? అవి మన ఆరోగ్యానికి ఏ విధంగా దోహదం చేస్తాయి అనే విషయానికి వస్తే..

బొప్పాయిలో ఉండే పోషకాలు ఇవే

బొప్పాయిలో ఉండే పోషకాలు ఇవే


బొప్పాయి పండులో మన శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ ఉంటాయి. ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలలో 62 క్యాలరీలు ఉంటాయి. బొప్పాయి పండులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులో ఉంటాయి. బొప్పాయిలో ఉండే కెరోటిన్, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, ఫోలేట్లు, పాంథోనిక్ ఆమ్లాలు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తాయి.

బొప్పాయితో అందం.. ఆరోగ్యం

బొప్పాయితో అందం.. ఆరోగ్యం

బొప్పాయి లో ఉండే పపెయిన్ అనే పదార్థం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన వ్యాధులు రాకుండా బొప్పాయి పండు ఎంతగానో పనిచేస్తుంది. చర్మ సౌందర్యం తో పాటు జుట్టు ఆరోగ్యానికి బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయి పండు తో ఫేస్ మాస్క్ వేసుకున్న, హెయిర్ మాస్క్ వేసుకున్న.. ముఖం మరియు జుట్టు ఎంతో నిగారింపుని సంతరించుకుంటాయి. బొప్పాయి మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

బొప్పాయితో బరువుకు చెక్

బొప్పాయితో బరువుకు చెక్

వైరల్ ఫీవర్ లు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా బొప్పాయి పండు మనల్ని కాపాడుతుంది. ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒక కప్పు బొప్పాయి ముక్కలను తినడం వల్ల బరువు తగ్గుతారు. బొప్పాయి ముక్కలను వేడి నీళ్లలో వేసుకుని తాగినా, ఉదయాన్నే బొప్పాయిని ఏ విధంగానైనా ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం బొప్పాయిని ఎలాంటి పరిమితులు లేకుండా తినవచ్చు. శరీరంలో టాక్సిన్స్ ని అంతం చేసి, బొప్పాయి ఒత్తిడిని తగ్గిస్తుంది. బొప్పాయి పండులో విటమిన్ ఏ ఉండటం వల్ల అది కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యానికి.. ఇమ్యూనిటీ బూస్టర్ గా

గుండె ఆరోగ్యానికి.. ఇమ్యూనిటీ బూస్టర్ గా


బొప్పాయి పండు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బొప్పాయి గుండె సంబంధిత కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యంగా పని చేసేలా చేస్తుంది. బొప్పాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ గా ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయిలో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల గట్టిదనానికి బొప్పాయి మేలు చేస్తుంది. బొప్పాయితో దంతాలు, చిగుళ్ళు సమస్యలు తగ్గుతాయి.

ఆరోగ్యం కోసం ప్రతీరోజు బొప్పాయిని తినండి..

ఆరోగ్యం కోసం ప్రతీరోజు బొప్పాయిని తినండి..


బొప్పాయిని తినడం వల్ల నోటి సంబంధిత సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది. బొప్పాయి వల్ల నోటి పూత తెల్లటి మచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా ఉంటాయి. అయితే బొప్పాయిని గర్భిణీలుగా ఉన్న స్త్రీలు మాత్రం తినకూడదు. ఒకవేళ గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తింటే గర్భ స్రావం జరుగుతుంది. బొప్పాయిలో ఉన్న పోషకాలు, పండు ఆరోగ్యానికి చేసే మేలు తెలుసుకున్న వాళ్ళు దైనందిన ఆహారంలో బొప్పాయిని భాగం చేసుకోవటం మరచిపోకండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+