health tips: మూత్రం దుర్వాసనా? అయితే ఈ వ్యాధుల డేంజర్ బెల్స్ కావొచ్చు!!
చాలా సందర్భాలలో మన ఆరోగ్య పరిస్థితిని మూత్రం వివరిస్తుంది. మూత్రం రంగు మారటం, లేదా మూత్రం దుర్వాసన రావడం వంటి అంశాలను చాలామంది పట్టించుకోరు. ఇక కొంతమంది ఈ విషయాన్ని వైద్యులకు చెప్పడానికి కూడా నామోషీగా ఫీల్ అవుతారు. అయితే మూత్రం దుర్వాసన రావడం ఏమాత్రం మంచిది కాదని, అది అనేక వ్యాధుల సంకేతాలను ఇస్తుందని చెబుతున్నారు వైద్యులు.
మూత్రం విపరీతంగా దుర్వాసన వస్తే ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, మన శరీరం లోపల జరిగే అనారోగ్యాన్ని ఏదో ఒక రూపంలో మన బాడీ తెలియజేస్తుందని, మూత్రం దుర్వాసన రావడం కూడా అటువంటి ఒక సంకేతమని చెబుతున్నారు. సాధారణంగా మూత్రం దుర్వాసన రావడం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతుంది. అయితే వారంరోజుల కంటే ఎక్కువ కాలం మూత్రం దుర్వాసన వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలి.

ఎక్కువ కాలం పాటు మూత్రం దుర్వాసన వస్తే కొన్ని వ్యాధులు ఉన్నట్టుగా, అవి ఆ వ్యాధి సంకేతాలని గుర్తించాలి. మూత్రం దుర్వాసన రావడం మధుమేహం పెరగడానికి సంకేతం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే, డయాబెటిస్ అదుపులో లేకపోతే మూత్రం దుర్వాసన వస్తుంది. డయాబెటిస్ బాధితులు మూత్రం దుర్వాసన వస్తుంటే డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
సహజంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రం దుర్వాసనకు గురవుతుంది. ఈ బ్యాక్టీరియా మూత్రవ్యవస్థలో చేరడంవల్ల మూత్రం దుర్వాసన వస్తుంది. అంతేకాకుండా కాలేయ వ్యాధులు ఉన్నవారిలో కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. మూత్రంలో విష పదార్థాలు, వ్యర్ధాలు చేరుతాయి. కాలేయం వాటిని విచ్ఛిన్నం చేయకపోవడం వల్ల మూత్రం ముదురు రంగులో వస్తుంది. అందులో బిలురూబిన్ పేరుకుపోవడం వల్ల గోధుమ, కాషాయం, నారింజ రంగులో మూత్రం ఉంటుంది.
అంతేకాదు మూత్రం దుర్వాసన రావడం వెనుక కిడ్నీల ఫెయిల్యూర్ కూడా ఒక కారణమై ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ రోజులు మూత్రం దుర్వాసన వస్తుంటే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదంగా పరిణమిస్తుంది. కనుక మూత్రం దుర్వాసన నిర్లక్ష్యం చెయ్యకుండా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications