Health tips: గోళ్ళు కోరికే అలవాటు మానలేకపోతున్నారా? ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!

చాలామందికి గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా సమస్య ఉన్నప్పుడు, టెన్షన్ గా అనిపించినప్పుడు గోళ్ళు కొరుకుతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. గోళ్ళు కొరకడం వెనక మానసిక సమస్య కారణమని చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీనిని ఒనికోఫాగియా అంటారు. మానసిక ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది వద్దన్నా వినకుండా గోళ్లు కొరుకుతారు.

ఏ పనినైనా పర్ఫెక్ట్ గా చెయ్యాలని భావించేవారు గోళ్ళను కొరుకుతూ ఉంటారు. ఖచ్చితత్వంతో కూడిన పనులు చేయాలని భావించేవారు ఒత్తిడికి లోనై గోళ్ళు కొరుకుతారు. అయితే ఈ గోళ్ళు కొరికే అలవాటును మానుకోవాలి అనుకుని, మానుకోలేకపోతున్న వారు ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.

 nailsbiting

గోళ్లను ఎంతో శుభ్రం చేసుకున్నప్పటికీ బ్యాక్టీరియా ఉంటుంది. గోళ్ల ద్వారా శరీరంలోకి బ్యాక్టీరియా చేరి రకరకాల జబ్బులకు కారణమవుతుంది. తరచుగా గోళ్లను కొరకాలని చేతులను నోట్లో పెట్టుకునే వారిని నిరోధించడం కోసం మౌత్ గార్డులను ఉపయోగించవచ్చు. మౌత్ గార్డుల వల్ల వాళ్లు గోళ్ళు కొరకలేరు. ఇక గోళ్ళకు నెయిల్ పాలిష్ వేయడం వల్ల కూడా వాళ్ళు నోట్లో వేలు పెట్టుకోవడం మానేస్తారు.

ఒకవేళ గోళ్ళు కొరకటానికి నోట్లో వేలు పెట్టుకున్నా నెయిల్ పాలిష్ వాసన వస్తుంది. దీంతో వాళ్లు గోళ్ళు కొరకటం ఆపే అవకాశం ఉంటుంది. గోళ్లను దగ్గరగా కత్తిరించుకోవడం వల్ల కూడా గోళ్ళు కొరకడానికి వీలు లేకుండా ఉంటాయి. దీంతో గోళ్లను కొరకకుండా వదిలేస్తారు. ఇక చేతులు తరచూ నోట్లో పెట్టుకొని గోళ్ళు కొరికే వాళ్ళు గోళ్ల ఆరోగ్యానికి హానికరం కాని చేదైన పదార్థాలను, చేదుగా ఉండే నూనెలను రాసుకోవాలి.

ఇలా చేయడం వల్ల వాళ్ళు నోట్లో వేలు పెట్టుకుంటే అది చేదుగా ఉండడం వల్ల గోళ్లను కొరకలేరు. ఇక కొన్ని నూనెల వాసన వల్ల కూడా వారికి వికారంగా అనిపించి గోళ్ళు కొరకడం మానేస్తారు. ఇంకా ఎన్ని చేసినా గోళ్ళు కొరకటం మానుకోలేదు అంటే అటువంటి వారు మానసిక వైద్యులను సంప్రదించి వారి సూచనలను పాటించడం మంచిదని సలహా ఇస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+