health tips: భయపెడుతున్న కండ్లకలక.. లక్షణాలు, నివారణ మార్గాలివే!!
కండ్ల కలక.. దీనినే పింక్ ఐ అని కూడా అంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా కండ్ల కలక ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలోనే ప్రబలుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండే కారణంగా, ఈ బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కళ్ళు కండ్ల కలక బారిన పడతాయి.
కండ్లకలక వస్తే కళ్ళు ఎర్రబారి కళ్ళలో నుంచి నీళ్లు కారుతాయి. కంటి రెప్పలు బాగా వాసి పోతాయి. అంతేకాదు రాత్రి పడుకుని తెల్లవారి నిద్ర లేచేసరికి కళ్ళు అతుక్కు పోతాయి. కళ్ళు ఎర్రబారడం, కళ్ళు దురదగా ఉండటం, కళ్ళ రెప్పల్లో వాపు, కళ్ళ నుండి నీరు కారణం, కళ్ళనుండి ఫ్లూయిడ్ డిశ్చార్జ్ కావడం కండ్లకలక లక్షణాలు.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడటం అవసరం. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కండ్లకలక చిన్నపాటి ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది కానీ, ఇది రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఏ పని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతుంది.
గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వర్షాకాలంలో వాతావరణం లో మురికి, కాలుష్య కారకాలు పెరిగిపోవడం వల్ల వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో ప్రజలు కండ్ల కలక తో బాధపడుతున్నారు. కండ్లకలక సమస్యకు మందులు వాడకపోయినా కొందరికి తగ్గిపోతుంది. అయితే ఇది ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణంగా కండ్లకలక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా దీని నుండి ఉపశమనం లభిస్తుంది.
కండ్లకలక వచ్చినవారు కంటిని తరచూ మంచినీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది .కండ్లకలక వచ్చిన వారు మిగతా వారికి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులను ఇతరులు వాడకూడదు. కండ్లకలక వచ్చిన వారు వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. మురికి చేతులతో కళ్ళను తాకకూడదు . సబ్బు నీటితో తరచూ చేతులు కడుక్కోవాలి.
కండ్లకలక కారణంగా కళ్లు దురదగా అనిపిస్తే పదే పదే రుద్దకూడదు. కళ్ళు తుడుచుకోవడానికి శుభ్రమైన కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ ని కానీ వాడాలి. కండ్లకలక వచ్చిన సమయంలో వ్యక్తిగత వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. మెడికల్ షాప్ లో దొరికే ఆర్టిఫిషియల్ టియర్స్ ని వాడటం వల్ల ఫలితం ఉంటుంది. అయితే ఆ ప్యాక్ మీద ఉన్న సూచనలు తప్పకుండా పాటించాలి. ఇలా సాధారణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కండ్ల కలక నుండి రిలీఫ్ పొందొచ్చు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications