Health tips: డయాబెటిస్ బాధితులు.. చర్మ సమస్యలతో జర భద్రం!!
మధుమేహం ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. మధుమేహం బారిన పడిన వారిలో శరీర అవయవాలపై ప్రభావం పడటమే కాకుండా, చర్మ సమస్యలు కూడా చోటుచేసుకుంటాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు చర్మ సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
దాదాపుగా 70 శాతం మంది మధుమేహ బాధితులు చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మధుమేహం వచ్చే ముందు చర్మంపై ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించకపోతే ఆ చర్మపు ఇన్ఫెక్షన్లు పెద్ద సమస్యగా మారుతాయి. శరీరంలోని రహస్య అవయవాల వద్ద, గోళ్లలో ఫంగస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తొందరగా తగ్గిపోదు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించదు.

చర్మంపై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా తయారై ఇబ్బంది పెడుతుంది. ఊపిరితిత్తులకు సోకే అవకాశం కూడా ఉంటుంది. డయాబెటిస్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించుకోకపోతే సెగగడ్డలు ఎక్కువగా వస్తాయి. అవి పగిలినట్లయితే మారడానికి చాలా సమయం పడుతుంది.
మధుమేహాన్ని అదుపులో పెట్టడానికి తీసుకునే మందులతో కూడా చాలామందికి చర్మంపై ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే దీనికి సంబంధించి మందులు వాడితే తగ్గిపోతుంది. అందుకే మధుమేహం బారిన పడిన వారు యాంటీ బ్యాక్టీరియల్ సోప్ ను వాడాలి. ఫంగస్ ఉన్నచోట యాంటీ ఫంగల్ పౌడర్ ను రాసుకోవాలి. వదులుగా ఉండే దుస్తులను వేసుకోవాలి.
ఇక మధుమేహ బాధితులు తరచుగా రక్త పరీక్షలు చేయించుకొని మధుమేహం తీరును పరిశీలించుకోవాలి. వైద్యుల సలహాతో మందులను తదనుగుణంగా మార్చుకుంటూ వాడాలి. అన్నిటికంటే జీవనశైలి విధానాన్ని మార్చుకొని డయాబెటిస్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే చర్మ సమస్యలు అతి పెద్ద సమస్యలుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications