health tips: పేదవాడి యాపిల్ సీతాఫలం.. పోషకాలు పుష్కలం!!
చలికాలం రానే వచ్చింది. ఈ సీజన్లో ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడే ముఖ్యమైన పండు సీతాఫలం. పేదవాడి ఆపిల్ గా చెప్పుకునే సీతాఫలాన్ని ప్రస్తుతం మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా అమ్ముతున్నారు. ఇక సీతాఫలాన్ని గురించి, ఇందులో ఉండే పోషకాలను గురించి మనం అనేక విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సీతాఫలం లో ఉన్న గొప్ప గుణాలు తెలుసుకుంటే కచ్చితంగా ఆ పండ్లను ఈ సీజన్లో వదిలిపెట్టరు.
సీతాఫలంలో శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల రోగాల బారిన పడకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. సీతాఫలంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనివల్ల మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతే కాదు ఇది రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుపడుతుంది.

సీతాఫలం శరీరంలోని కొలెస్ట్రాల్ ను పెరగకుండా చేస్తుంది .ఇక సీతాఫలం తినడంతో లభించే విటమిన్ బి తో అధిక రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. సీతాఫలానికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది. సీతాఫలం తినేవారిలో చర్మ సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయని, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు . సీతాఫలం తినేవారిలో జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు .
సీతాఫలం లో ఉండే మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన శరీరానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడతాయి చెబుతున్నారు. సీతాఫలం శరీరంలో వచ్చే వాపులకు, నొప్పులకు ఒక మందులా పనిచేస్తుందని సూచిస్తున్నారు. అంతేకాదు ఎముకల ఆరోగ్యానికి సీతాఫలం ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.
సీతాఫలం మన జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుందని , అంతేకాదు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సీతాఫలం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. సీతాఫలంతో కీళ్ళనొప్పులు, కండరాల బలహీనత తగ్గిపోతాయని చెబుతున్నారు . ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఉండదని అంటున్నారు.
విటమిన్ b6 ఉండడం వల్ల ఆస్తమాను నియంత్రిస్తుందని సహజమైన చక్ర ఆరోగ్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు. మధుమేహంతో బాధపడే వారు కూడా ఈ పండును రుచి చూడవచ్చని, అయితే ఎక్కువగా మాత్రం తినకూడదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications