health tips: నిద్ర రావట్లేదా? గాఢనిద్ర కోసం ఈ ఆహారాలు తినండి!!

చాలామంది రాత్రివేళ నిద్ర రావడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి ఆరోగ్యానికి గాఢనిద్ర కూడా చాలా అవసరం. సరైన నిద్ర లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. రోజంతా కష్టపడి పనిచేసినా చాలామందికి సరిగా నిద్ర పట్టదు. అలాంటి వారు ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పదార్ధాలను చేర్చుకుంటే, నిద్ర నాణ్యత పెరుగుతుంది.

మంచి నిద్ర పోవాలంటే, గాఢ నిద్ర రావాలంటే ఎటువంటి ఆహారాన్ని తినాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. రాత్రివేళ గాఢ నిద్ర రావాలంటే నిద్రకు ఉపక్రమించే మూడు గంటల ముందు అన్నాన్ని తినాలి. బియ్యంలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అన్నం తినడం వల్ల నిద్ర బాగా వస్తుంది.

sleepleesnight

రాత్రి పడుకునే ముందు గుప్పెడు చెర్రీస్ ను తింటే కూడా నిద్ర బాగా వస్తుంది. చెర్రీస్ లో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్రకు అవకాశం ఉంటుంది.శరీరానికి అవసరమైన పోషకాలు, డ్రై ఫ్రూట్స్ లో చాలా ఉంటాయి.. రాత్రివేళ సరిగా నిద్రపట్టని వాళ్ళు డ్రైఫ్రూట్స్‌ను తింటే హాయిగా నిద్రపడుతుంది.

డ్రై ఫ్రూట్స్ లో మంచి మొత్తంలో మెలటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. రాత్రివేళ నిద్రపట్టనివారు అరటిపండు తింటే కూడా హాయిగా నిద్ర పడుతుంది. అరటిపండు కూడా నిద్రకు ఉపయోగపడే హార్మోన్ల ఉత్పత్తికి ఎంతగానో దోహదం చేస్తుంది. అరటిపండులో పొటాషియం మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి.

రాత్రిపూట నిద్ర పట్టనివాళ్ళు ద్రాక్ష పండ్లను తినవచ్చు. ద్రాక్షా పండ్లలో కూడా నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉంటుంది. చాలా మంది ఓట్స్‌ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా మాత్రమే తీసుకుంటారు. కానీ రాత్రిపూట నిద్ర పట్టనివాళ్లు ఓట్స్‌ను రాత్రి సమయంలో పడుకునే ముందు తింటే నిద్రకు కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది.

పడుకునే ముందు తేనె తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. మెదడు నుండి మెలటోనిన్ హార్మోన్ విడుదల చేయడానికి తేనె సహాయపడుతుంది. ఇక రాత్రిపూట సరిగా నిద్రపట్టని వారు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో పోషకాహారం తీసుకోవాలి. యోగా చేస్తే కూడా నిద్ర బాగా పడుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+