health tips: మందులు వాడినా కంట్రోల్ కాని డయాబెటిస్.. ఇలా చేస్తే అవుతుంది!!
డయాబెటిస్.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ బారిన పడ్డారంటే కచ్చితంగా శరీరంలోని వివిధ ఆర్గాన్స్ పై అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక డయాబెటిస్ బాధితులు ఇప్పుడు డయాబెటిస్ విషయంలో జాగ్రత్తగా ఉండి, మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కేవలం మందులే డయాబెటిస్ ను తగ్గించవు.
అయితే చాలామంది ఎన్ని మందులు వాడినా డయాబెటిస్ కంట్రోల్ కావడంలేదని, రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడం లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటివారు డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని నియమాలు పాటిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. మందులు వేసుకోవడంతో పాటు ఆహార నియమాలు, వ్యాయామం అవసరమని చెబుతున్నారు.

డయాబెటిస్ కంట్రోల్ కానివారు ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి. కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకొని, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనివారు తెల్ల అన్నం తినకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు. తెల్ల అన్నం బదులు, బ్రౌన్ రైస్ తింటే మంచిదని చెబుతున్నారు. అన్నంతో పాటు తినే కూరల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక కప్పు బ్రౌన్ రైస్ కు రెండు కప్పుల కూర తింటే మంచిదని సలహా ఇస్తున్నారు. రాగి జావ, కొర్రలు, ఊదలు, అండ్రు కొర్రలు వంటి తృణ ధాన్యాలు వండుకుని తింటే మంచిదని చెబుతున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే బొప్పాయి పండు, జామ పండు వంటి పండ్లను తినడం మంచిదని సూచిస్తున్నారు.
ఇక రాత్రివేళ భోజనాన్ని 7 గంటల్లోపే పూర్తి చేయాలని, భోజనం చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేయాలని చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ ను ఆహార నియమాలతో కంట్రోల్లో పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. మంచి ఆహారం, వ్యాయామం, మెడిసిన్స్ మూడింటితో డయాబెటిస్ పెరగకుండా కాపాడుకోవాలని సలహా ఇస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ












Click it and Unblock the Notifications