వేసవిలో ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా
వేసవికాలం వచ్చిందంటే శరీరానికి ఎక్కువగా నీటి అవసరం ఉంటుంది. వేసవిలో శరీరానికి కావలసిన తగినంత నీటిని తాగడం మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పండ్ల రసాలను తాగడం కూడా ఎంతో మంచిది. వేసవిలో ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నారింజ పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు తగిన మోతాదులో ఉంటాయి. ఇందులో విటమిన్ సి లభిస్తుంది.
వేసవిలో ఆరెంజ్ జ్యూస్ తో జీర్ణ వ్యవస్థ మెరుగుదల
వేసవిలో ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఆరెంజ్ జ్యూస్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అతిసారం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించడంలో ఆరెంజ్ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది.

కళ్ళ సమస్యల నుండి ఉపశమనం
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు ఆరంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కంటి చూపు బాగా మెరుగుపడుతుంది ఇందులో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి ఆరోగ్యం బాగుపడుతుంది.
అంతేకాదు విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ జ్యూస్ ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చర్మానికి ఆరోగ్యం
వేసవిలో ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది చర్మానికి మెరుపును ఇస్తుంది. ఆరెంజ్ జ్యూస్ ను ప్రతిరోజు తాగడం వల్ల మన శరీరంలో రక్తం పెరుగుతుంది. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి, ఐరన్ శోషణ ను పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే శరీరం బలంగా ఉంటుంది.
శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది
బలహీనత ఉన్నవారు దాని నుండి ఉపశమనం పొందడానికి ఆరెంజ్ జ్యూస్ ను తాగవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరానికి పోషకాలను అందించి ఎనర్జీని ఇస్తుంది. కూల్ డ్రింక్స్ తాగేకంటే ఆరెంజ్ జ్యూస్ తాగటం అన్ని విధాలా శ్రేయస్కరం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications