Health tips: డిప్రెషన్ తగ్గాలంటే ఆహారంలో ఏం తినాలో మీకు తెలుసా?
విపరీతంగా పెరిగిన పని ఒత్తిడి, శారీరక వ్యాయామం లేని జీవన శైలి కారణంగా చాలామంది డిప్రెషన్ కు గురి అవుతున్నారు. డిప్రెషన్ బారినపడి ఇబ్బంది పడుతున్న వారు ఆసుపత్రులకు వెళుతూ, మెడిసిన్స్ వేసుకుంటూ, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బంది పడుతున్నారు. అయితే డిప్రెషన్ బారినపడిన వారు ఆహారాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా కొంతమేరకు డిప్రెషన్ నుండి బయటపడవచ్చు.
డిప్రెషన్ తగ్గాలంటే ఎటువంటి ఆహారాన్ని తినాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. డిప్రెషన్ నుంచి ఉపశమనం కోసం ప్రభావవంతంగా పని చేసే కొన్ని ఆహారాలు ఉన్నాయి. విటమిన్ బీ 12 గుణాలు పుష్కలంగా ఉన్న కోడిగుడ్లను తీసుకోవడం వల్ల ఒత్తిడి మరియు డిప్రెషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.

వాల్ నట్స్ తీసుకున్నట్లయితే డిప్రెషన్ తగ్గుతుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి, సంతోషంగానూ, ఒత్తిడి రహితంగా వుంచడానికి వాల్ నట్స్ తీసుకోవాలి. డిప్రెషన్ నుంచి బయటపడడం కోసం కొన్ని ఆకుకూరలు, కూరగాయలు కూడా చాలా బాగా పనిచేస్తాయి పాలకూరను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరిగి మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల కొంత డిప్రెషన్ తగ్గుతుంది.
టమాటాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ డిప్రెషన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒత్తిడి మరియు డిప్రెషన్ నుండి ఉపశమనం పొందడం కోసం ద్రాక్ష పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం. ద్రాక్ష పండ్ల తో డిప్రెషన్ బాగా తగ్గుతుంది. ఇక బాదంపప్పులను నీళ్లలో నానబెట్టి పొట్టు తీసి తినడం వల్ల కూడా డిప్రెషన్ బాగా తగ్గుతుంది.
అంతేకాదు పీచు, మెగ్నీషియం, విటమిన్-ఇ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్న బాదంపప్పును పాలల్లో కలుపుకొని తాగడం వల్ల కూడా డిప్రెషన్ నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. జీడిపప్పు తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి మరియు డిప్రెషన్ కొంతమేరకు తగ్గుతుంది. జీడిపప్పు కూడా మెదడుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి డిప్రెషన్ తో బాధపడే వారు ఈ పదార్థాలను ఆహారంలో భాగంగా ట్రై చేస్తే బెటర్ అని చెబుతున్నారు వైద్యులు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications