health tips: నలభై దాటాక పొట్ట పెరుగుతుందా? కారణాలు, పరిష్కారాలు తెలుసుకోండి!!
చాలామంది 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత నుండి పొట్ట పెరిగిందని తెగ బాధపడుతూ ఉంటారు. పెద్దగా తినకపోయినా పొట్ట మాత్రం పెరుగుతుందని, తగ్గించే మార్గం ఏమిటని తెగ అన్వేషిస్తూ ఉంటారు. అయితే 40 సంవత్సరాల తర్వాత హార్మోన్ల ప్రభావం కారణంగా మన శరీరంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మహిళలలో మెనోపాజ్ దశలో పొట్ట పెరగడానికి హార్మోన్ల అసమతుల్యత కారణమని చెబుతారు.
మహిళలలో ఈ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తక్కువ కావడం వల్ల, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా పొట్ట చుట్టూ, పొత్తికడుపు దగ్గర కొవ్వు పేరుకుపోయి పొట్ట చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది. అయితే దీనిని ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇలా పొట్ట పెరగడం క్రమంగా బరువు పెరగడానికి, అనేక అనారోగ్యాలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ పొట్టను తగ్గించుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో అవిసె గింజలను భాగంగా చేసుకుంటే అవి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, అధిక బరువును తగ్గించడానికి కూడా దోహదం చేస్తాయని చెబుతున్నారు. అవిసె గింజలలో ఉండే మోనో అన్సాచ్యురేటెడ్ కొవ్వు లే ఇందుకు కారణమని చెబుతున్నారు.
అవిసె గింజలు మన శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తామని ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాదు సబ్జా గింజలలో కూడా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే మంచి గుణాలు ఉన్నాయని సూచిస్తున్నారు. సబ్జా గింజల లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది పేగు కదలికలను ప్రేరేపించి అనేక రకాలైన జీర్ణ సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తాయని చెబుతున్నారు.
క్రమం తప్పకుండా సబ్జా గింజలను తీసుకోవడం వల్ల పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు గణనీయంగా తగ్గుతుందని సూచిస్తున్నారు. ఇక దాల్చిన చెక్కలో కూడా పొట్ట కొవ్వును తగ్గించే మంచి గుణాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దాల్చిన చెక్కను ఎక్కువగా వాడటం మంచిది కాదు, తగిన మోతాదులో దాల్చిన చెక్క వాడటం వలన పొట్ట కొవ్వును తగ్గించవచ్చు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications