Health tips: నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? ఆరోగ్యం కోసం కచ్చితంగా పాటించాల్సిన రూల్స్ ఇవే!!
చాలామంది ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు రాత్రిళ్లు పని చేస్తూ ఉంటారు. ఇక నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.
నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసే వాళ్ళు నిద్ర ఆపుకోవటానికి ఏది పడితే అది తినటం, తాగటం చేస్తుంటారు. కానీ అది మంచిది కాదు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్ర వస్తుందని కాఫీలు, టీలు తాగకూడదు .దీంతో ఉదయం నిద్ర పోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అంతేకాదు అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తాగాలి .

మజ్జిగ, జావా ఇలాంటివి తీసుకోవాలి. దీంతో శరీరం అలసి పోకుండా ఉంటుంది. నైట్ డ్యూటీ చేసే వాళ్ళు రాత్రివేళ మసాలాలు, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు, కార్బోహైడ్రేడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినకూడదు. ఒకవేళ రాత్రి సమయంలో తినాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, సలాడ్స్ వంటివి తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఉదయం, సాయంత్రం కాసేపైనా వ్యాయామం యోగా వంటివి చేస్తే శారీరక, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.మద్యపానం అస్సలు మంచిది కాదు. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు మద్యం సేవిస్తే పని సరిగా చేయలేక ఒత్తిడితో ఇబ్బంది పడతారు.కాబట్టి జాగ్రత్త. ప్రతిరోజూ కాసేపు ఎండ తగిలేలా చూసుకోవాలి. శరీరానికి ఎండ తగలకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది.
ఇక నైట్ డ్యూటీ చేసే వాళ్ళు నిద్రపోయే సమయాన్ని విభజించుకోవాలి. వాళ్ళు నిద్ర పోవాలి ఉదయం పూట నాలుగు గంటలు, మళ్లీ డ్యూటీ సమయానికి ముందు మరో రెండు మూడు గంటలు నిద్ర పోవాలి. నిద్ర పోవడానికి వీలుగా ఇంట్లో బెడ్ రూమ్ సిద్ధం చేసుకొని, కుటుంబ సభ్యులకు సహకరించవలసిందిగా ముందే చెప్పి పెట్టుకోవాలి. నిద్ర సమయంలో సెల్ ఫోన్ మ్యూట్ పెట్టుకుంటే మంచిది.

రాత్రివేళ డ్యూటీ చేసే వాళ్ళు ఇంట్లో పనులు చేయడానికి కూడా నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. పక్కాగా షెడ్యూల్ చేసుకోవాలి.మధుమేహం, హైబీపీ ఉన్నవారు ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా మేరకు మందులు వేసుకోవాలి. శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా వైద్యుల్ని సంప్రదించి వైద్యుల సూచన ప్రకారం మందులు వాడాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications