Health tips: ఆరోగ్యకరమైన కాలేయం కోసం ఈ ఐదు ఆహారాలు మర్చిపోవద్దు!!

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. కాలేయం శరీరంలో రెండవ అతి పెద్ద అవయవం. కాలేయం పక్కటెముకల కింద పొట్ట పైభాగాన కుడి వైపున ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి కాలేయం కీలకంగా పనిచేస్తుంది. కాలేయం పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

ఇక అటువంటి కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకుంటే మంచిది. ఇది కాలేయంలో ఉన్నటువంటి చెడు కొవ్వును తగ్గించి, కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాలేయం వాపును, కొవ్వును తగ్గించడంలో ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ ఎంతగానో దోహదం చేస్తాయి.

 healthy liver!!

కాలేయం దెబ్బ తినకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఆహారంలో మనం పసుపు తీసుకోవడం మరచిపోవద్దు. పసుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మంటను తగ్గిస్తాయి. కాలేయం దెబ్బ తినకుండా కాపాడతాయి. ఇక పచ్చి కూరగాయలు, ఆకుకూరలు కాలేయం ఆరోగ్యాన్ని కాపాడతాయి. పచ్చి కూరగాయలు కొవ్వు ఏర్పడకుండా నిరోధిస్తాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఇవి తగ్గిస్తాయి. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పొద్దుతిరుగుడు విత్తనాలు ఎంతగానో దోహదం చేస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలలో జీర్ణక్రియకు సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయం ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు వీట్ గ్రాస్ కూడా అసాధారణమైన కాలేయ ఎంజైమ్లను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మంచిది. కాలేయ సమస్యలు రాకుండా ఉండాలి అంటే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. తక్కువ కొవ్వు పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఎక్కువ ఫైబర్ ను ఆహారంలో తీసుకోవాలి. నీటిని పుష్కలంగా తాగాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+