Health tips: ఆ అనారోగ్య సమస్యలుంటే యాలుకలు తినకూడదు.. డేంజర్!!
వంటల్లో సువాసన కోసం ఉపయోగించే మసాలా దినుసులలో యాలుకలు ఒకటి. పోషకాలు సమృద్ధిగా ఉండే యాలుకలు మంచి ఫ్లేవర్ ఇవ్వడంతో పాటుగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాలుకలు మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగపడతాయి. యాలుకలలో ఉన్న బోలెడన్ని ఔషధ గుణాలు మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదపడతాయి. అంతేకాదు క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. యాలుకలు డిప్రెషన్ ను తగ్గిస్తాయి.
పాలలో చిటికెడు యాలకుల పొడి వేసుకుని తాగితే మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. బీపీ, షుగర్ వ్యాధులను కంట్రోల్ చేసే గొప్ప గుణాలు యాలుకలకు ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న యాలుకలు శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అయితే యాలుకలు కొంతమందికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు యాలకులను అసలు తీసుకోకూడదని చెబుతున్నారు.

యాలుకలు తీసుకోకుండా జాగ్రత్త పడవలసిన వారు ఎవరు? ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు యాలుకలు తీసుకోకూడదు? వంటి అంశాలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భధారణ సమయంలో అధిక మొత్తంలో యాలకులు తీసుకోవడం మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు యాలుకలు తినే అలవాటు ఉంటే కచ్చితంగా ఒకసారి వైద్యున్ని సంప్రదించాలి.
అంతేకాదు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు యాలుకలను అస్సలు తీసుకోకూడదు ఒకవేళ అలాంటి వారు ఎవరైనా యాలకులను తీసుకుంటే వారికి శ్వాసకోశ సమస్యలు మరింత రెట్టింపు అవుతాయి. ఇక అలర్జీలతో బాధపడేవారు యాలకులు తీసుకోవడం మంచిది కాదు. యాలుకలు అలర్జీలను మరింత పెంచి అనవసరపు ఇబ్బందులను కలిగిస్తాయి.
దగ్గు సమస్యతో బాధపడేవారు యాలకులు తీసుకోవడం మంచిది కాదు. అంతేకాదు బాగా వికారంగా అనిపించినప్పుడు కూడా యాలుకలు తీసుకోకూడదు. అలాంటి సమయంలో యాలుకలు తీసుకుంటే ఇబ్బంది ఎదురవుతుందని, వాంతులు అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఐదు సమస్యలు ఉన్నవారు యాలుకలకు దూరంగా ఉండడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications