health tips: వేసవిలో అతిగా చెరకురసం తాగుతున్నారా? అయితే యమా డేంజర్!!
చెరుకు రసం ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే కొన్ని రకాల జబ్బులు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు.
వేసవికాలం వచ్చిందంటే చాలామంది చెరుకు రసం తాగడానికి ఆసక్తి చూపిస్తారు. చెరుకు రసం ఆరోగ్యానికి మంచే చేస్తుంది. చెరుకు రసంలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. చెరుకు రసాన్ని తాగడం ఏమాత్రం తప్పు కాదు.అలా అని అతిగా చెరుకు రసం తాగితే ప్రమాదం బారిన పడతారని అంటున్నారు. అయితే కొన్ని వ్యాధులు ఉన్నవారు చెరుకు రసాన్ని తాగకూడదని, చెరుకు రసం గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటే మంచిదని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు.
చెరకు రసంలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం , మరియు ఐరన్ ఉంటాయి. చెరుకు రసాన్ని తాగడం వల్ల శరీరం డిహైడ్రేట్ కాదని చెబుతున్నారు. చెరకు రసం శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుందని చెప్పవచ్చు. చెరుకు రసంలో బోలెడన్ని పోషకాలు ఉన్నప్పటికీ జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. చెరుకు రసంలో చాలా ఎక్కువ క్యాలరీలు ఉండడం వల్ల, రోజుకు ఒక గ్లాస్ కంటే ఎక్కువ చెరుకు రసం తాగడం మంచిది కాదని చెప్పబడింది. ఎక్కువగా చెరుకు రసం తాగితే కొందరిలో రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు చెరుకు రసానికి దూరంగా ఉంటే మంచిది.ఎక్కువగా చెరుకు రసం తాగితే బరువు ఎక్కువగా పెరగడానికి, ఊబకాయం రావడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు చెరుకు రసం ఎక్కువగా తాగే వారిలో నిద్రలేమి సమస్య వస్తుందని చెరుకు రసంలో ఉండే పోలికొసనాల్ సమ్మేళనం అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని, నిద్రలేమి సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు.

ఇక చెరుకు రసం ఎక్కువగా తాగే వారిలో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుందని, ఏదైనా గాయమైనప్పుడు రక్తస్రావం జరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. మధుమేహం బాధితులు చెరుకు రసాన్ని తాగకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. చెరుకు రసంలో విపరీతమైన చెక్కెర ఉంటుందని కనుక మధుమేహ బాధితులు చెరుకు రసాన్ని తాగకూడదని సూచిస్తున్నారు. అంతేకాదు చెరుకు రసం తీసిన తర్వాత 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిలువ ఉంటే, అది ఆక్సీకరణం చెంది విషపూరితంగా మారుతుందని, ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications