Health tips: చలికాలంలో చంపేసేలా పొడిదగ్గు.. మీ ఇంట్లోనే మూడు గొప్ప ఆయుర్వేద నివారణలు!!

చలికాలం మొదలైన దగ్గరనుంచి జలుబు, దగ్గులతో ఇబ్బంది పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో దగ్గు వచ్చిందంటే ఒక పట్టాన వదలదు. కాస్త చల్లటి నీళ్లు తాగినా, చలిగాలి ఒంటికి తగిలినా దగ్గు మొదలవుతుంది. ఈ దగ్గు విపరీతంగా మారినప్పుడు కనీసం నిద్ర కూడా పోలేని పరిస్థితి వస్తుంది. విపరీతంగా ఛాతిలో నొప్పి రావడంతో పాటు, గొంతు నొప్పి కూడా బాధిస్తుంది.

తులసి
పొడి దగ్గుకి మన ఇంట్లోనే అద్భుతమైన ఆయుర్వేద నివారణలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకునేందుకే ఈ కథనం. పొడి దగ్గును తగ్గించడానికి తులసి ఎంతో బాగా పనిచేస్తుంది. తులసి ఒక ఆయుర్వేదిక దివ్య ఔషధంగా దగ్గుకి పనిచేస్తుంది. శ్వాస కోశ ఇబ్బందులు, శ్లేష్మాన్ని తొలగించడంలో తులసి ఎంతో బాగా ఉపయోగపడుతుంది . తులసి సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ కావడంతో ఇది ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.

Health tips: Dry cough in winter.. 3 great Ayurvedic remedies at home!!

అల్లం
పొడి దగ్గుని తగ్గించడానికి ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా చెప్పబడిన మరొక పదార్థం అల్లం. అల్లం కఫాన్ని తగ్గించడంతో పాటుగా, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అల్లం గొంతు వాపుని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాల వల్ల ఇది పొడి దగ్గును కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అల్లం, తేనెతో పాటు, అల్లాన్ని వేసి హెర్బల్ టీ తయారు చేసుకొని తాగినట్లయితే పొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

పసుపు
గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి, పొడి దగ్గు నుండి రిలీఫ్ పొందడానికి పసుపు చాలా బాగా పనిచేస్తుంది. వేడి పాలలో పసుపు వేసుకొని తాగడం వల్ల దగ్గు నుండి రిలీఫ్ లభిస్తుంది పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పొడి దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. పసుపు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అనేక ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా యాంటీ బాడీ ప్రతిస్పందనలను పసుపు ప్రేరేపిస్తుంది. పొడి దగ్గుతో బాధపడుతున్న వారు వీటిని ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందుతారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+