health tips: వేగంగా బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఈ అలవాట్లను పాటించండి!!
ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన సమస్య ఊబకాయం. విపరీతంగా బరువు పెరిగి, బరువు తగ్గక ఇబ్బందులు పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం శూన్యంగా మారడంతో చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే బరువు తగ్గాలి అనుకునే వారు రోజువారీ సరైన దినచర్యను పాటించాలని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు కొన్ని అలవాట్లను తప్పనిసరిగా అలవర్చుకోవాలని, ఉదయాన్నే లేవగానే ఈ అలవాట్లను పాటించటం వల్ల వేగంగా బరువు తగ్గడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే పళ్ళు తోముకోకుండానే ఒక గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. పరగడుపున ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అంతేకాదు ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. యోగా కారణంగా మానసిక ఆరోగ్యం మెరుగు పడడమే కాకుండా, బరువు కూడా బాగా తగ్గుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే మార్నింగ్ వాకింగ్ చేయడం అలవాటు చేసుకున్న వారు బరువు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం నడవడం వల్ల శరీరంలో కేలరీలు ఖర్చవుతాయి. దీంతోపాటు సంతోషకర హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది. ఇది మీ బరువు తగ్గడంతో పాటు, ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. దీంతో ఊబకాయం సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.
అంతేకాదు ఉదయం పూట ఆరోగ్యకరమైన ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవాలి. నూనెలో ముంచి తీసిన పదార్ధాలకు స్వస్తి పలకండి. బరువును నియంత్రణలో ఉంచే, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం మిమ్మల్ని బరువు తగ్గేలా చేస్తాయి. ఇక ఈ అలవాట్లను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే వేగంగా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు, వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!! -
అసలైన షడ్రుచుల ఉగాది పచ్చడి.. ఇలా చేస్తే టేస్ట్ తో పాటు..! -
పసుపు పచ్చ పుచ్చకాయ.. కనిపిస్తే వదలొద్దు -
సంచలన రిపోర్ట్:పెరిగిన నూడుల్స్ గిరాకీ, ప్యాకేజీ ఫుడ్కే జై -
నయా స్టైల్ 'టమాటో పూదీనా చట్నీ'.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..! -
యువతలో కొత్తరకం లైంగిక అలవాట్లు.. గొంతు క్యాన్సర్ ముప్పు తప్పదా..? -
హోటల్ స్టైల్ "చికెన్ ఫ్రైడ్ రైస్" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..? -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే!












Click it and Unblock the Notifications