health tips: విరేచనాలు అవుతుంటే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!!

ఒక్కొక్కసారి మనం తీసుకున్న ఆహారం సరిపడకపోతే డయేరియా బారిన పడతాం. జీర్ణ ప్రక్రియ సరిగా లేకుంటే విరేచనాలు అవుతుంటాయి. విపరీతమైన కడుపునొప్పితో కూడిన విరేచనాలు లేదా లూజ్ మోషన్స్ చాలా అసౌకర్యంగా ఉంటాయి. మాటిమాటికి బాత్రూంకి పరిగెత్తడం తో పాటు, లూజ్ మోషన్స్ కావడం వల్ల శరీరంలో ఉన్న నీరంతా బయటకు పోయి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా ఓపిక లేనట్టు, నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇలాంటి సమయంలో ఏదైనా ఆహారం తినాలన్నా కూడా తినలేని పరిస్థితి ఉంటుంది. ఏది తింటే ఏమవుతుందో అన్న భయం వేధిస్తుంది. విరేచనాల వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందటానికి, అలాగే విరేచనాలను కంట్రోల్ చెయ్యటానికి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

health tips: Food precautions to control diarrhea or loose motions

విరేచనాలు ఇబ్బంది పెడుతున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఏం తినొచ్చు ఏం తాగొచ్చు అనేది తెలుసుకుని తదనుగుణంగా ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు అరటిపండు తినడం మంచిదని, అరటిపండు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుందని, ఫలితంగా మోషన్ నార్మల్గా ఉంటుందని చెబుతున్నారు.

అరటి పండులో ఉండే పొటాషియం, ఫైబర్ కడుపులో సాధారణ స్థితికి దోహదం చేస్తాయని చెబుతున్నారు. అంతేకాదు చెక్కు తీసిన యాపిల్స్ కూడా ఈ సమస్యకు బాగా పనిచేస్తాయని, యాపిల్స్ కూడా తినొచ్చని చెపుతున్నారు. ఇక మసాలాలు, పులుపు లేని తేలికపాటి ఆహారం తినటం మంచిదని అంటున్నారు. నీటిని ఎక్కువగా తాగాలని చెప్తున్నారు.

విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లను తాగితే మంచిదని కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ బాడీలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తాయని, విరేచనాల వల్ల శరీరంలో పోయిన నీటి శాతాన్ని కొబ్బరినీరు పూరిస్తుంది అని చెబుతున్నారు. కొబ్బరి నీళ్ళు శరీరానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తాయని చెప్తున్నారు.

అంతేకాదు మజ్జిగ అన్నిటికంటే ఎక్కువ ప్రభావవంతంగా మన జీర్ణవ్యవస్థను దారిలోకి తెస్తుందని చెబుతున్నారు. మజ్జిగ కడుపులో కావలసిన మంచి బాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాని బయటకు పంపిస్తుందని, అయితే పుల్లటి మజ్జిగను ఈ సమయంలో తాగకూడదని, తాజాగా ఉన్న మజ్జిగ వల్ల త్వరగా విరేచనాల సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+