Health tips: పిల్లల బ్రెయిన్ చురుగ్గా ఉండాలంటే పెట్టాల్సిన ఆహారాలు!!
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, చురుకుగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లల మెదడు కంప్యూటర్ లా పనిచేయాలని కోరుకోని తల్లిదండ్రులు ఎవరు ఉండరు. కానీ పోషకాల కొరత కారణంగా పిల్లల మెదడు చురుకుగా పని చేయడం లేదు. ఇక పిల్లల మెదడును చురుకుగా ఉంచే ఆహారాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
పిల్లల మెదడు చురుకుగా పనిచేసేలా జ్ఞాపకశక్తిని పెంచేలా ఉపయోగపడే ఆహార పదార్థాలలో గ్రుడ్డు ఒకటి. కోడిగుడ్లను పిల్లలకు పెడితే వాళ్ల బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. గుడ్డులో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వు మరియు కార్బోహైడ్రేట్ల వంటి పోషకాలతో పాటు కోలిన్ ఉంటుంది. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు , జ్ఞాపక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి పిల్లలకు చేపలను ఆహారంగా పెట్టాలి. ఓట్స్ ను ఆహారంగా ఇవ్వడం కూడా మంచిది . ఓట్స్ లో పిల్లల శరీర ఎదుగుదలకు, పిల్లల మెదడు చురుకుగా పనిచేయడానికి కావలసిన అన్ని పోషకాలు ఉంటాయి.
విటమిన్ ఈ, బి కాంప్లెక్స్, జింక్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఓట్స్ లో ఉంటాయి కాబట్టి ఓట్స్ ను ఆహారంగా ఇవ్వాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లలకు రోజు గంజిని తాగించాలి. దీనివల్ల పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారు. దీంతో వారి శరీరానికి కావలసిన శక్తి కూడా వస్తుంది. పిల్లలకు రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలను తినిపించాలి.
టమాటా, క్యారెట్, బచ్చలి కూర ఇలా రకరకాల రంగులు ఉన్న ఆకుకూరలు కూరగాయలను తినిపిస్తే ఇవి మెదడును షార్ప్ చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. ప్రతిరోజు పిల్లల ఆహారంలో పాలను చేర్చండి. పాలతో పాటుగా పెరుగు జున్ను నెయ్యి మొదలైన వాటిని కూడా పిల్లల ఆహారంలో భాగం చేస్తే పిల్లలు శారీరకంగానూ, మానసికంగానూ దృఢంగా ఉంటారు.
ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే బీన్స్ ను పిల్లల ఆహారంలో చేర్చండి. దీని వల్ల కూడా పిల్లల బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. పిల్లల శరీరానికి, మానసికంగా ఎదగడానికి కావలసిన పోషకాలను అందిస్తే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications