వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచే ఆహారాలివే
ప్రస్తుతం మనం విపరీతమైన వేసవి కాలాన్ని చూస్తున్నాం. గతానికి భిన్నంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులను చూస్తున్నాము. గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు బద్దలు కొడుతూ విజృంభిస్తున్న పరిస్థితులను చూస్తున్నాము. అయితే ఈ సమయంలో వేసవి వేడి నుండి తట్టుకోవడానికి మనం కొన్ని ఆహార పదార్థాలను తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
హైడ్రేటెడ్ గా శరీరాన్ని ఉంచే ఆహారాలు
వేసవి కాలంలో శరీరం చెమట కారణంగా డీహైడ్రేట్ అవుతుంది. ఇలా శరీరం డీహైడ్రేట్ అవ్వడం వల్ల మన శరీరంలో ఉన్న శక్తినంత లాగేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో డీ హైడ్రేట్ కాకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని ఆహార పదార్థాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అంతేకాదు ఎక్కువగా నీటిని కూడా తాగాలి.

కీరా దోస
ఇక ఆహారాలలో నీరు సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారాలను తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడటానికి దోహదం చేస్తాయి.అటువంటి వాటిలో కీరా దోసకాయ ఒకటి. కీరా దోసకాయ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో డీహైడ్రేట్ అయిన నీటిని తిరిగి మనకు అందించడానికి సహాయం చేస్తుంది.
పుచ్చకాయ
కీర దోసకాయలు 95 శాతం కంటే ఎక్కువ నీటి కంటెంట్ తో ఉంటాయి. వీటిని సలాడ్ గా చేసుకుని తింటే మన శరీరానికి కావలసిన నీటి శాతం పుష్కలంగా లభిస్తుంది. ఇక వేసవి కాలంలో అత్యధికంగా నీటితో నిండి ఉండే మరొక ఆహారపదార్థం పుచ్చకాయ. ఇది కూడా మన శరీరం హైడ్రేటెడ్ గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
నారింజ, బచ్చలికూర వంటి ఆకుకూరలు
నారింజ పండ్లలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నారింజ పండ్లలో విటమిన్ సి మంచి మూలకంగా ఉండటమే కాకుండా, 87% నీటిని కలిగి ఉండడం వల్ల వీటిని తింటే శరీరంలో నీటి లోటు తీరుతుంది. అంతేకాదు ఆకుకూరల్లో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో నీటి శాతం, పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఎండాకాలంలో మెరుగైన ఆహారంగా చెప్పవచ్చు.
క్యాప్సికం, సొరకార బీరకాయలలోనూ వాటర్ కంటెంట్
అలాగే క్యాప్సికం.. క్యాప్సికం కూడా 92 శాతం నీటి కంటెంట్తో మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇక క్యాప్సికమ్ ను సలాడ్లలో భాగంగా చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయ, బీరకాయ వంటి కూరగాయలలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఎండాకాలంలో తినడం చాలా మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
బీరకాయ పెరుగు పచ్చడి.. ఇలా చేస్తే రుచి, ఆరోగ్యం కూడా! -
రెస్టారెంట్ స్టైల్ "జీడిపప్పు చికెన్ పకోడీ" ఇలా చేస్తే అదరహో !! -
అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు, వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications