health tips: చలికాలంలో బరువు పెరిగారా? తగ్గేందుకు ఈ పండ్లు తినండి!!
శీతాకాలం కావడంతో విపరీతమైన చలి కొనసాగుతుంది. దీంతో చాలావరకు జనం బద్ధకంగాను, అనారోగ్యంగాను ఉంటున్నారు. శీతాకాలంలో రకరకాల వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలా ఒకటేమిటి చాలా రకాల సమస్యలు మనపై దాడి చేస్తాయి. అంతేకాదు శీతాకాలంలో విపరీతంగా బరువు కూడా పెరుగుతారు. ఇక ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఆరోగ్యంగా ఉండడానికి, బరువు తగ్గించుకోవడానికి కొన్ని పండ్లు తింటే మంచిదని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు.
ముఖ్యంగా శీతాకాలంలో లభించే సీజనల్ పండ్లు తినడం వల్ల శరీర బరువు తగ్గించుకోవడం మాత్రమే కాకుండా ఈ కాలంలో మన శరీరానికి కావలసిన ఎనర్జీని తిరిగి సంపాదించుకోవచ్చు అని చెబుతున్నారు. మరి ఆ పండ్లేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.శీతాకాలంలో ఈ సీజన్లో దొరికే సీతాఫలాలను తినడం మంచిదని, వీటిలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సితో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.

శీతాకాలంలో నారింజ పండ్లను తినడం మంచిదని, నారింజలో ఉండే విటమిన్ సి శరీరాన్ని డిటాక్స్ చేసేందుకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక శీతాకాలంలో ఆపిల్ పండ్లను కూడా తినటం మంచిదని, ప్రతిరోజూ ఒక యాపిల్ పండు తింటే అనేక రోగాల నుంచి మన శరీరాన్ని కాపాడుకున్న వాళ్ళమవుతామని చెబుతున్నారు.

చలికాలం బరువు తగ్గించుకోవడం కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఆపిల్ పండు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. శీతాకాలంలో జామ పండ్లను తినడం మంచిదని, జామ పండ్లలో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయని జామ పండ్లు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదని చెబుతున్నారు. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుందని, మధుమేహం వ్యాధిగ్రస్తులకు జామపండు చాలా మంచిదని చెబుతున్నారు.

శీతాకాలంలో దానిమ్మ పండ్లు తింటే మంచిదని, దానిమ్మ పండును బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయని చెబుతున్నారు. ఇక కివీ పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనాన్ని చేకూరుస్తాయని, కివి పండ్లు బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. కనుక సీజనల్ పండ్లను ఒక క్రమ పద్దతిలో తింటే ఫిట్ గా ఉంటామని, బరువు తగ్గుతామని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications