health tips: మీ జుట్టును నాశనం చేస్తున్న చుండ్రు సమస్యను వదిలించుకోండిలా!!

చాలామంది తలలో చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. తలలో చుండ్రు ఉంటే వెంట్రుకలు కూడా రాలిపోతాయి. హెయిర్ ఫాల్ విపరీతంగా పెరుగుతుంది. చుండ్రు తలలో ఒక రకమైన చర్మవ్యాధి. పొడిబారిన చర్మం వల్ల, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల, షాంపూ తగినంత వాడకపోవడం వల్ల , సూక్ష్మజీవుల వల్ల ఇలా అనేక రకాల కారణాలతో చుండ్రు సమస్య వస్తుంది.

ఇక చుండ్రు నుంచి బయటపడాలంటే అనేక నివారణ మార్గాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా చుండ్రు తగ్గించుకోవడంపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇక చుండ్రు సమస్యను తగ్గించుకోవడం కోసం అనేక ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. నిమ్మరసాన్ని స్కాల్ప్ మీద బాగా మసాజ్ చేయడం వల్ల చుండ్రు చాలా వరకు తగ్గుతుంది.

health tips

పుదీనా రసాన్ని బాగా తలకు పట్టించి అరగంటసేపు వదిలేసి ఆ తర్వాత తలను శుభ్రం చేస్తే చుండ్రు సమస్య ఉండదు. అంతేకాదు వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి ఓ పావుగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి తల శుభ్రంగా ఉంటుంది. మెంతికూరను కూడా దంచి పేస్టులాగా చేసి తలకు రాస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గి వెంట్రుకలు నిగనిగలాడతాయి.

విపరీతమైన చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడిని కలిపి, ఆ పేస్టును తలకు బాగా పట్టించి అరగంట తర్వాత స్నానంచేస్తే మంచి ఫలితం ఉంటుంది. మెంతులు కూడా చుండ్రుని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయం ఆ మెంతులను పేస్ట్ గా చేసి దానిని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానంచేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

కలబంద కూడా చుండ్రు సమస్యను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గటంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చుండ్రు సమస్యను పరిష్కరించుకోవచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+