Health tips: లవంగాలతో బోలెడు లాభాలు.. ఎన్ని రోగాలకు దివ్యౌషధమో తెలుసా!!
లవంగాలు ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండే మసాలా దినుసు .మంచి రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి లవంగాలు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనేక రోగాల బారి నుండి లవంగాలు మనలను కాపాడతాయి. అసలు లవంగాలు ఎన్ని రకాలుగా పనిచేస్తాయి? ఎన్ని అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం కలిగిస్తాయి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
శీతాకాలంలో చాలామంది జలుబుతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు లవంగాల టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు మన దగ్గరకు రాకుండా పోరాటం చేస్తాయి. ఇక శీతాకాలంలో చాలా మంది విపరీతమైన దగ్గుతో బాధపడుతూ ఉంటారు. పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి లవంగం చాలా బాగా పనిచేస్తుంది.ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల పొడిదగ్గు నయమవుతుంది. కఫం సమస్య బాగా తగ్గుతుంది.

రోజు లవంగం టీ తాగితే జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు. భోజనం చేసిన గంట తర్వాత లవంగం టి తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. చాలామంది పంటినొప్పితో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు లవంగం టీ తాగడం వల్ల లేదా లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.
లవంగాలలో యుజైనాల్ అనే తైలం ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్ గా లవంగాలను వాడడం వల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. లవంగాలలో ఉండే యుజైనాల్ తైలం యాంటీసెప్టిక్ లా పనిచేసి పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది. పంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

లవంగాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయని అధ్యయనాలు తేల్చాయి. డయాబెటిస్ తో బాధపడే వారికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి అని చెబుతున్నారు. లవంగాలలో ఉండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రెగ్యులర్ గా లవంగాలను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు.. -
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications