health tips: ఆరోగ్యంపై సబ్జా గింజల మ్యాజిక్: బెనిఫిట్స్ మామూలుగా లేవుగా!!
సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి త్రాగితే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బరువు, బీపీ వంటి సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.
సబ్జా గింజలు.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. సబ్జా గింజలను నీటిలో వేసుకుని నానబెట్టుకుని అవి బాగా ఉబ్బిన తర్వాత వాటిని మనం తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచాడు సబ్జా గింజలను నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు ఎంతో సాఫీగా జరుగుతాయని చాలామంది చెబుతున్నారు. సబ్జా గింజలలో ఉన్న సీక్రెట్స్ తెలిస్తే, సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే వాటిని నిత్యం మనం తీసుకోకుండా ఉండలేమని చెబుతున్నారు.

సబ్జా గింజలతో బరువుకు చెక్
ఇక సబ్జా గింజలు మన ఆరోగ్యం విషయంలో చేసే మ్యాజిక్ ఏమిటంటే సబ్జా గింజలలో ఉండే ప్రత్యేకమైన గుణం వల్ల వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ వల్ల ఇవి బరువును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. చర్మ సమస్యలను అరికట్టడంలో కూడా సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయి.

బీపీని తగ్గించటంలో సబ్జా గింజల పాత్ర గణనీయం
ఉదయం తెల్లవారుజామున పరగడుపున కూడా సబ్జా గింజల నీళ్లని తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు. బీపీ మాటిమాటికీ పెరిగే వారికి సబ్జా గింజలు చాలా గొప్పగా పనిచేస్తాయని, బీపీని నియంత్రించడంలో సబ్జా గింజల పాత్ర గణనీయమైనదని చెబుతారు. శరీరంలో తేమ తగ్గి నీరసించి పోకుండా సబ్జా గింజలు శరీరానికి కావలసిన తేమను అందిస్తాయని చెబుతారు. తలనొప్పి, గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం వంటి అనేక సమస్యల నుంచి సబ్జా గింజలు ఉపశమనం కలిగి నీళ్లలో సబ్జా గింజలను నానబెట్టుకొని, వాటిని తినేయాలని చెబుతున్నారు.

శ్వాస సమస్యలకు చెక్
శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలను వేసి కలుపుకొని తీసుకోవడం వల్ల శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సబ్జా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు సబ్జా గింజలతో పరిష్కారం అవుతాయి. సబ్జా గింజలను మనం నిత్య ఆహారంలో భాగంగా చేసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఫలితంగా మనం తక్కువ ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది.

అందానికి సబ్జా... రోజూ తీసుకోండి
మహిళలకు కావలసిన ఫోలేట్ తో పాటుగా, విటమిన్ ఈ కూడా సబ్జా గింజల్లో ఉండటం వల్ల ఇవి అందాన్ని మరింత ఇనుముడింపజేస్తాయి. అందంతోపాటు ఆరోగ్యాన్ని ఇచ్చే సబ్జా గింజలను, ముఖ్యంగా బరువు తగ్గించడాన్ని ఇట్టే చేసే సబ్జా గింజలను తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications