Health tips: షుగర్ కంట్రోల్ కావట్లేదా? వేపాకులతో ఇలా చెయ్యండి!!
డయాబెటిస్.. ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇక భారతదేశంలో కూడా డయాబెటిస్ బాధితులు పెరుగుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ముందు ముందు మధుమేహం ముప్పు పొంచి ఉందని, అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నామని, ఇప్పటికే ఐ సి ఎం ఆర్ స్పష్టం చేసింది. కనుక డయాబెటిస్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సరైన జీవన విధానం, ప్రతిరోజు వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు డయాబెటిస్ బారిన పడకుండా కాపాడతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇదిలా ఉంటే చాలామంది డయాబెటిస్ బారిన పడిన తర్వాత షుగర్ కంట్రోల్ కావడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. ఇక అలాంటి వారు షుగర్ కంట్రోల్ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు, ఆహారపు అలవాట్లను, నిద్ర అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

అంతేకాదు ఆయుర్వేదంలో షుగర్ ను కంట్రోల్ చేయడానికి వేప ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెప్పబడింది. ప్రతిరోజు ఆయుర్వేద వైద్యుల సూచనల మేరకు వేపాకులను నమిలి తిన్నా, వేప కషాయం చేసుకుని తాగినా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడింది. వేప యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. దానిలో అనేక వ్యాధు లను తరిమికొట్టే గొప్ప లక్షణం ఉంటుంది. వేప చెట్టులోని ప్రతి భాగం ఔషధ యుక్తమే.
వేప డయాబెటిస్ ను పూర్తిగా నయం చేయలేక పోవచ్చు కానీ వ్యాధి తీవ్రత ను మాత్రం తగ్గించగలదని, డయాబెటిస్ ఎక్కువగా పెరగకుండా చూడగలదని పరిశోధనలలో తేలింది. ప్రతిరోజు ఒక క్రమపద్ధతిలో ఉదయం లేవగానే వేపాకులను తిన్నా, వేప ఆకులతో కషాయం తయారుచేసుకొని తాగినా రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి అని చెబుతున్నారు.
వేపాకుల కషాయం తయారు చేసుకోవడానికి 20 వేపాకులను నీళ్ళలో వేసి నీరంతా వేపాకుల రసం దిగి పచ్చగా మారేదాకా మరిగించుకోవాలి. ఆపై దానిని వడకట్టి వేడిగా కానీ చల్లార్చిన తర్వాత గాని రోజుకు రెండు సార్లు తాగితే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. ఇక డయాబెటిస్ ను కంట్రోల్ చేయడమే కాకుండా వేపాకు చర్మ వ్యాధులకు, నోటి సమస్యలకు, ఇన్ఫెక్షన్లు, శరీరం మంట తదితర ఆరోగ్య సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications