health tips: పచ్చి ఉల్లిపాయను రోజూ తింటే షుగర్ కంట్రోల్.. ఇంకా బోలెడు బెనిఫిట్స్!!
ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ తినడం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదిక్ వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజు 50 గ్రాములు ఉల్లిపాయలను కచ్చితంగా తినడం వల్ల శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయని, షుగర్ బాధితులకు షుగర్ కంట్రోల్ లోకి వస్తుందని చెబుతున్నారు.
డయాబెటిస్ తో బాధపడుతూ అల్లోపతి మందులు వాడి, ఆ మందులతో ప్రయోజనం లేదని భావిస్తున్న వారు ప్రతి రోజు క్రమం తప్పకుండా వారంరోజులపాటు 50 గ్రాములు పచ్చి ఉల్లిపాయను తిని ఆ తర్వాత, డయాబెటిస్ ఎంత కంట్రోల్ అయిందో చెక్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఉల్లి డయాబెటిస్ ను నియంత్రిస్తుందని, 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం అని చెబుతున్నారు.

ఉల్లిపాయలు ఉదయం పచ్చివి తిన్నా సరే, లేదా అన్నంలో కలుపుకొని తిన్నా సరే పచ్చి ఉల్లినే తినాలని చెబుతున్నారు.ఒకేసారి 50 గ్రాముల ఉల్లిపాయను తినలేకపోతే, రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో ఉల్లిపాయలు తినొచ్చని చెబుతున్నారు. నేరుగా పచ్చి ఉల్లిపాయను తినలేక పోతే, పచ్చి పులుసు లాగా చేసుకుని అందులో ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుని కూడా తినొచ్చని చెపుతున్నారు.
అంతేకాదు పచ్చి ఉల్లిపాయ ముక్కలను నీళ్లలో వేసి మరిగించి తాగితే మూత్రంలో ఎవరికైనా మంటగా ఉంటే, ఆ మంట కచ్చితంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్లఉప్పు పొడిని కలిపి రోజుకు రెండు మూడు సార్లు తింటూంటే నీళ్ల విరోచనాలు, వాంతులు కంట్రోల్ అవుతాయని చెబుతున్నారు.
ఉల్లిపాయలను గుజ్జుగా దంచి మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ ను కలిపి తింటూ వుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయని, జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుందని చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమం సమస్య తగ్గిపోతుందని, పురుషులలో వీర్యకణాల సమస్య పోతుందని, శృంగారంలో కూడా పురుషులు యాక్టివ్ గా ఉంటారని చెబుతున్నారు.

అంతేకాదు పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల బిపి, గుండెపోటు, ఆస్తమా, నిద్ర లేమి, స్థూలకాయం, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. ప్రతిరోజు 50 గ్రాములు పచ్చి ఉల్లిపాయను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications