health tips: ఆలస్యంగా నిద్రపోతున్నారా? ఈ అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే!!
చాలామంది రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, విపరీతమైన ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం, మొబైల్ ఫోను ఎక్కువగా వినియోగించడం వంటి కారణాలు నిద్రలేమి సమస్యను కలిగిస్తాయి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక అనర్ధాలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఇక ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఎదురయ్యే అనర్ధాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సాధారణంగా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. అలా నిద్రపోలేని వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. సరిపడినంత నిద్రపోని వారి కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చి ముఖం అందవిహీనంగా మారుతుంది.

నిద్ర సరిగ్గా పని వారిలో కోపం, చిరాకు, విసుగు పెరుగుతాయి. నిరుత్సాహం వారిని ఆవహిస్తుంది. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడతారు. రక్తపోటు పెరుగుతుంది. వారు ఏ పనినీ సమర్ధవంతంగా చెయ్యలేరు. ఇక శరీర తీరును బట్టి కొంతమందికి నిద్రపోకపోతే బరువు తగ్గుతారు. ఇంకొంతమంది నిద్రపోకపోతే బరువు పెరుగుతారు.
ఆలస్యంగా నిద్రపోవడం వల్ల తొందరగా నిద్ర పట్టదు. ఉదయాన్నే లేవాలంటే తలంతా పట్టేసినట్టుగా ఇబ్బందిగా ఉంటుంది .బద్దకంగా అనిపిస్తుంది. ఆలస్యంగా నిద్రలేవడం వలన ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి ఆయుషు కూడా తగ్గిపోతుంది. నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలే కాకుండా చర్మ సమస్యలు కూడా వస్తాయి. చర్మం నిగారింపు తగ్గుతుంది.
నిద్ర సరిగా లేకపోతే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చిన్న చిన్న అలెర్జీలను కూడా తట్టుకునే శక్తి కూడా శరీరానికి ఉండదు. ఇక నిద్రలేమి సమస్య దీర్ఘకాలం ఉంటే గుండె పోటు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. గుండెకు రక్త సరఫరా నిదానించటం, వాల్వ్ లు ఫెయిల్ అవ్వడం వంటివి సంభవిస్తాయి. కాబట్టి నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications