health tips: స్నానం చేసే నీటిలో నిమ్మరసం.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!!
నిమ్మకాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు కో కొల్లలు. నిమ్మ రసం మనకు ఉత్తేజాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గటానికి కూడా ఉపయోగ పడుతుంది. అంతేకాదు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలామంది నిమ్మకాయను చాలా మంది నిత్యం తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసాన్ని తేనెను తాగుతూ ఉంటారు. నిమ్మకాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం మాత్రమే కాకుండా, స్నానం చేసే నీళ్లలో నిమ్మ రసాన్ని కలుపుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

నిమ్మరసాన్ని స్నానం చేసే నీళ్లలో కలుపుకోవడం వల్ల ఇది అరోమా థెరపీ పని చేస్తుంది. నిమ్మరసం యొక్క సువాసన మీ మనసును రిఫ్రెష్ చేస్తుంది. ఈ నీటితో స్నానం చేయడం వల్ల శరీరం కాంతివంతం అవుతుంది. నిమ్మకాయ మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మన చర్మాన్ని కాపాడుతుంది. నిమ్మకాయ శరీరంపై ముడతలను నివారిస్తుంది. చర్మం నిగారింపు సొంతం చేసుకునేలా చేస్తుంది.
నిమ్మకాయ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అంతేకాదు నిమ్మకాయ ను ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. నిమ్మరసం నల్లటి మచ్చలను తొలగిస్తుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మరసం సువాసన మనసును ప్రశాంత పరుస్తుంది. నిమ్మరసం కలుపుకున్న నీళ్ళతో స్నానం చెయ్యటం వల్ల మంచి హాయినిచ్చే నిద్ర పడుతుంది.
స్నానం చేసే నీళ్లలో నిమ్మరసం కలుపుకుని ఆ నీటితో స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఆరోగ్యకరమైన శ్వాసకోశ వ్యవస్థను నిమ్మరసం ప్రోత్సహిస్తుంది. నిమ్మరసం కలిపిన నీళ్ళతో స్నానం చేస్తే అది సహజ దుర్గంధ నాశని గా నిమ్మరసం మన శరీరం పై పని చేస్తుంది. మన శరీరం, మనస్సు కూడా తాజాగా, ఫ్రెష్ గా మారుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications