health tips: రాత్రి నిద్రకూ అందానికి లింక్.. అర్దరాత్రి దాకా నిద్రపోకుంటే అనర్ధాలివే!!
చాలామంది ప్రతిరోజు నిద్రపోవడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి దాకా ఫోన్లలో మునిగిపోయి ఎప్పటికో నిద్రపోతూ ఉంటారు. ప్రతిరోజు రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా ఉండేవారిలో మెదడు పనితీరు మందగిస్తుంది.
ఆలస్యంగా నిద్రపోయే వారిలో సర్కేడియన్ రిథమ్ దెబ్బతింటుంది. దీనివలన అర్ధరాత్రి మెలకువ రావడం, ఉదయం, మధ్యాహ్నం నిద్ర రావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. రాత్రి ఆలస్యంగా పడుకునే వారిలో హార్మోనల్ సమస్యలు కూడా తలెత్తుతాయి. జీర్ణ సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

రాత్రి ఆలస్యంగా పడుకునేవారు ఊబకాయులుగా మారే ఆ ప్రమాదం ఉంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల వ్యక్తులలో తిండిపై కంట్రోల్ పోతుంది. ఫలితంగా అధికంగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, బరువు పెరగడంతో ఊబకాయం వస్తుంది. రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల అనేక రకాలైన వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఫలితంగా అనారోగ్యం బారిన పడతాము.
ఆలస్యంగా నిద్రపోయే వారిలో మెదడు పనితీరు మందగిస్తుంది. ఏకాగ్రత లోపిస్తుంది. పనిని ఉత్సాహంగా చేయలేరు. జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుంది. అంతేకాదు మానసిక ఆరోగ్యం పైన కూడా సరైన నిద్ర లేకపోవడం ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. చిరాకు కలుగుతుంది. ఆందోళన అధికమవుతుంది. మూడు స్వింగ్స్ ఏర్పడతాయి.
రాత్రి సరిగా నిద్ర పోకపోతే అందవిహీనంగా మారుతాము. చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మెలకువతో ఉంటే చర్మంపై ముడతలు వస్తాయి. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి.
అర్ధరాత్రి వరకు మెలకువతో ఉంటే సంతానోత్పత్తి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆడవారిలోనైనా, మగవారిలో నైనా సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది.కాబట్టి ఈ అనర్ధాలను దృష్టిలో పెట్టుకుని రాత్రి వేళ త్వరగా నిద్రపోండి .లేదంటే ఆనారోగ్యాలతో ఆస్పత్రి పాలు కావాల్సిందేనని చెప్తున్నారు వైద్య నిపుణులు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications