Health tips: ఈ కూరగాయలతో కొన్ని వారాల్లోనే బరువు తగ్గుతారు!!
చాలామంది ఇప్పుడు ఊబకాయంతో తెగ బాధపడుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గడం కోసం, బరువు తగ్గి స్లిమ్ గా మారడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. శరీరాన్ని స్లిమ్ గా మార్చాలని ప్రతి రోజు వ్యాయామం చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే శరీర బరువు తగ్గాలంటే వ్యాయామం మాత్రమే కాదు ఆహారం పై నియంత్రణ అంతే అవసరమని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ లు.
బరువు తగ్గడానికి కొన్ని ఆహారాలు తినడం కూడా చాలా ముఖ్యం అని చెబుతున్నారు. చాలామంది ఎంత వ్యాయామం చేసినప్పటికి ఇంట్లో సరిగ్గా ఆహారం తీసుకోక, బయట ఏది పడితే అది తింటూ ఉంటారు. అయితే అలాంటి వారు వ్యాయామం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరు గానే మారుతుందని హెచ్చరిస్తున్నారు.

బయట తినడం మానేసి ఇంట్లో కొన్ని రకాల కూరగాయలను కొన్ని నెలల పాటు ఎక్కువగా ఆహారంలో తీసుకుంటే మంచి రిజల్ట్ వుంటుందని, త్వరగా కొవ్వు కరిగి స్లిమ్ అవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక అటువంటి కూరగాయలతో ముఖ్యంగా చెప్పుకోవలసినవి మూడు కూరగాయలు.
త్వరగా బరువు తగ్గడం కోసం దోసకాయ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. కూరలలో దోసకాయ కూరలు, కీరదోసకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. దోసకాయ లో తగినంత పీచు పదార్థం ఉండటం వల్ల, దోస కాయ తింటే కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దీంతో బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

సొరకాయ.. సొరకాయ లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సొరకాయను తింటే కూడా బరువు తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉదయం సొరకాయ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారు అని చాలామంది చెబుతారు. సొరకాయలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి సొరకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఈజీ గా బరువు తగ్గొచ్చు.
ఇక బరువు తగ్గడానికి దోహదం చేసే కూరగాయలలో క్యాలీఫ్లవర్ కూడా ఒకటి. క్యాలీఫ్లవర్ లో ఫైబర్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ తిన్నట్లయితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. క్యాలీఫ్లవర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ప్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications