Health tips: ఆరోగ్యానికి, అందానికి.. బెండకాయలతో బోలెడు ప్రయోజనాలు!!
బెండకాయలు.. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. బెండకాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బెండకాయలు తింటే కొలాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మన చర్మం అందంగా ఉండడానికి, వృద్ధాప్య రాకుండా చూడడానికి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది.
అయితే బెండకాయలను తినడం వల్ల మన ఆరోగ్యానికి సంబంధించి బోలెడు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటంటే..బెండకాయలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బెండకాయలలో ఉండే అధిక ఫైబర్ మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, అలాగే మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బెండకాయ లో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ ను మరియు బిపిని నియంత్రించడంలో గణనీయంగా సహాయపడతాయి.

బెండకాయలు తరచుగా తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బెండకాయ లో ఉండే విటమిన్ ఏ కళ్ళ సమస్యలను దూరం చేస్తుంది. ప్రతిరోజు బెండకాయలను తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బెండకాయలలో ఎక్కువ ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి నిత్యం బెండకాయలు తింటే బరువు తగ్గుతారు.
బెండకాయలలో ఉండే విటమిన్ సి, క్యాల్షియం మరియు మెగ్నీషియం ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తుంది. బెండకాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. ఎలాంటి రోగాలు రాకుండా ఇమ్యూనిటీని పెంచడంలో బెండకాయలు బాగా పనిచేస్తాయి. బెండకాయలలో ఉండే కొలాజిన్, యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.
జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు బెండకాయలు మనకు మనం ఊహించనంత మేలు చేస్తుంది. బెండకాయలను తింటే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక షుగర్ ఉన్న వారు బెండకాయలను తినొచ్చా అని అనుమానపడుతూ ఉంటారు. డయాబెటిస్ ఉన్నవారికి బెండకాయలను తినడం ఎంతో మంచిది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను బెండకాయలు బాగా తగ్గిస్తాయి. షుగర్ బాధితులు బెండకాయలను శుభ్రంగా తినొచ్చు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications