Health tips: 40ఏళ్ళు దాటినవారు బరువు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!!
మహిళలు 40 సంవత్సరాల తర్వాత బరువు పెరగడం ప్రారంభిస్తారు. ఒకసారి మహిళలు బరువు పెరగడం ప్రారంభిస్తే తర్వాత దాన్ని తగ్గించుకోవడం అంత తేలికైన పని కాదు. శారీరక శ్రమ తగ్గడం వల్ల, అలాగే హార్మోనల్ మార్పుల కారణంగా వయసు పెరుగుతున్న కొద్ది బరువు కూడా పెరగడం ప్రారంభమవుతుంది. ఫలితంగా స్థూలకాయం వస్తుంది. స్థూల కాయం పెరగడం వల్ల శరీర ఆకృతి లేకుండా అవడమే కాకుండా, అనేక వ్యాధులకు కారణంగా మారుతుంది.
40 సంవత్సరాలు పైబడి ఉంటే ఖచ్చితంగా బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి.. లేదంటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బరువు తగ్గడం కోసం కాస్త మనసుపెట్టి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. బరువు తగ్గడం కోసం చేసే కొన్ని పనులు మీకు ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తాయి. వయసు పెరిగేకొద్దీ మానసిక సమతుల్యత మారడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో బ్యాలెన్సింగ్ వ్యాయామాలు చేయడం, ధ్యానం వంటి కార్యకలాపాలు ప్రయోజనాన్ని ఇస్తాయి.

అంతేకాదు మెనోపాజ్ తర్వాత మీ బరువు పెరుగుతూ ఉంటే దానిని నియంత్రించడానికి లైట్ వెయిట్ ట్రైనింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల క్యాలరీలు కరిగిపోవడం తో పాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలోని ఎముకలు బలహీన పడడం ప్రారంభమవుతాయి. కాబట్టి ఎముకల బలోపేతానికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు చేయాలి. అంతేకాదు ఆహారంలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
40 సంవత్సరాల పైబడిన వారికి వయసుతో పాటు చిరాకు తరచుగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, అలాగే ఒత్తిడికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి . నిద్రలేమి సమస్య ఊబకాయానికి మరియు బరువు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి 40 సంవత్సరాల వయసు దాటిన వారు నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పెరుగుతున్న వయసుతో పాటు ఆహారంలో మార్పు చాలా అవసరం. కాబట్టి శారీరక మరియు మానసిక, వయస్సు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. బరువు తగ్గాలంటే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. 40 ఏళ్ల వయసు దాటిన వారు తప్పనిసరిగా నీరు ఎక్కువగా తాగాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications