Health tips: బరువు తగ్గటానికి పైనాపిల్ డైట్: మంచిదా.. కాదా తెలుసుకోండి!!

ఊబకాయం.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. సరైన జీవన విధానం లేకపోవడం వల్ల, నిద్ర పోవడం వల్ల, విపరీతమైన పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం వల్ల చాలామంది ఊబకాయ బాధితులుగా మారుతున్నారు. బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి అనేక సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు.

ఇక బరువు తగ్గాలని , సన్నబడాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేస్తూ బరువు తగ్గడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఇక ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ బరువు తగ్గడం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు లేకపోలేదు. ఇక అతి తక్కువ సమయంలో బరువు తగ్గాలని భావించే వారు రకరకాల డైట్ లను ఫాలో అవుతున్నారు. అటువంటి డైట్ లలో పైనాపిల్ డైట్ ఒకటి.

Health tips

బరువు తగ్గడానికి పైనాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా వేగంగా బరువు తగ్గుతారు. అయితే పైనాపిల్ తో బరువు తగ్గుతారు కాబట్టి పైనాపిల్ డిట్ తీసుకొచ్చారు. ఇతర ఆహారాలు తీసుకోకుండా ఒక్క పైనాపిల్ మాత్రమే ఆహారంగా తీసుకుంటే 5 రోజుల్లో 5 కిలోలు బరువు తగ్గుతారని చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం రెండు పైనాపిల్స్ తింటే బరువు తగ్గుతారు అని చెబుతున్న వారు లేకపోలేదు.

అయితే పైనాపిల్ ను అంత ఎక్కువగా తినడం మంచిదేనా? పైనాపిల్ డైట్ వల్ల కలిగే హాని ఏమిటి? అన్నది చాలా మందికి తెలియదు. పైనాపిల్ ఒక రెండు రోజులపాటు తినడం మంచిదే. రోజంతా ఏమీ తినకుండా ఆకలి అనిపించినప్పుడు కేవలం పైనాపిల్ ముక్కలను తింటూ చేసే డైట్ ను పైనాపిల్ డైట్ అంటారు. అయితే పైనాపిల్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజంతా ఇంకేమీ తినకపోతే హానీ జరగదు.

Health tips:

అయితే పోషకాహార నిపుణులు మాత్రం ఈ పైనాపిల్ డైట్ ను రెండు రోజులకు మించి చేయడం సరికాదని చెబుతున్నారు. ఇటువంటి డైట్ ల పై ఎక్కువ కాలం ఆధారపడితే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలంటే ఒక క్రమ పద్ధతిలో నిదానంగా తగ్గాలి కానీ, ఇలా ఏ డైట్ పడితే ఆ డైట్ ఫాలో చేస్తూ బరువు తగ్గాలనుకుంటే కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పైనాపిల్ మంచిదే కానీ దీనిని అతిగా తింటే ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+